పవర్ ఫ్లైయాష్ వాడకంపై కొత్త మార్గదర్శకాలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:18 AM
విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న థర్మల్/లిగ్నైట్ పవర్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే బూడిద (ఫ్లైయాష్) వినియోగించక పోతే జరిమానా తప్పదని కేంద్రం తెలిపింది.
ముసాయిదా విడుదల చేసిన కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న థర్మల్/లిగ్నైట్ పవర్ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే బూడిద (ఫ్లైయాష్) వినియోగించక పోతే జరిమానా తప్పదని కేంద్రం తెలిపింది. విధిగా 80ు ఫ్లైయాష్ వినియోగించాల్సిందేనని, లేకపోతే ప్రతి టన్నుకు రూ.1,000 జరిమానా విధిస్తామని పేర్కొంటూ.. ఫ్లైయాష్ వినియోగ నోటిఫికేషన్‌ను సవరిస్తూ కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పులశాఖ శనివారం ముసాయిదా విడుదల చేసింది. దీనిపై 60 రోజుల్లోగా అభ్యంతరాలు/సూచనలు/సలహాలను ఢిల్లీలోని కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ కార్యదర్శికి గానీ, టౌజిటఝఛీఝ్ఛజఃజౌఠి.జీుఽ అనే ఈ-మెయిల్‌కు గానీ పంపాలని కోరింది. ఫ్లైయాష్ వినియోగంపై పర్యవే క్షణాధికారాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నుంచి కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ)కు బదిలీ చేసింది. బూడిద వాడకంపై సీపీసీబీ మార్గదర్శకాల మేరకు అడిటర్లతో లెక్కలు తీసి నివేదికను సిద్ధం చేస్తారు. కాగా, సీపీసీబీ వెబ్‌సైట్‌కు బదులు కోల్ యాష్ మేనేజ్‌మెంట్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని నిబంధన తెచ్చింది. ఫ్లైయాష్, ఓవర్ బర్డెన్‌లకు బదులు బూడిదతో ఖాళీ గనులను నింపేయాలని మార్చారు. గతంలో టన్నుపై రూ.1500 జరిమానాను రూ.1000లకు తగ్గించారు. ఈ ముసాయిదాపై వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాల ఆధారంగా తుది నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేస్తుంది.