పొరపాట్లు లేకుండా జనగణన చేయాలి
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:35 PM
ల్లాలో జనగణన ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సం తోష్ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జనగణన ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సం తోష్ అధికారులను ఆదేశించారు. జనగణన- 2027 ప్రక్రియలో భాగంగా మొదటి దశగా హౌస్‌లిస్టింగ్, హౌస్ సెన్సస్ నిర్వహణకు సం బంధించి జిల్లా చార్జ్ స్థాయి అధికారులకు శిక్ష ణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మొదలైన ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై జిల్లా స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. దేశంలో దాదాపు 15ఏళ్ల తర్వాత నిర్వహించత లపెట్టిన జనగణన-2027 ప్రక్రియ అత్యంత ముఖ్యమైనదని చెప్పారు. ఈ ప్రక్రియ ఆధా రంగా దేశంలో అభివృద్ధి పణాళికలు రూపొం దించబడుతాయని నియోజకవర్గాల పునర్విభ జన చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు పొరపాట్లు లేకుండా బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ప్రతీ ఇంటిని ఖచ్చితంగా గుర్తించి గృహాల వివరాలను జాగ్ర త్తగా నమోదు చేయాలని చెప్పారు. జనగణన కోసం బ్లాక్‌లను గుర్తించడం, ఎన్యుమరేటర్ లను అపాయింట్ చేయడం జిల్లా చార్జ్ అధికా రుల బాధ్యత అన్నారు. శిక్షణ మాన్యువల్‌ను పూర్తిగా అధ్యయనం చేసి ఎన్యుమరేటర్లకు శిక్ష ణ ఇవ్వడానికి ముందు పూర్తి అవగాహన కలి గి ఉండాలని అధికారులకు కలెక్టర్ సూచిం చా రు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అమ రేందర్, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.