Share News

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:21 PM

శాంతిభద్రతలకు విఘాతం కలగ కుండా నిబంధనలకు లోబడి గణపతి ఉ త్సవాలను జరుపుకోవాలని ఎస్‌ఐ వీరబా బు అన్నారు.

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి
ఉత్సవాలపై మాట్లాడుతున్న ఎస్‌ఐ వీరబాబు

చారకొండ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యో తి) : శాంతిభద్రతలకు విఘాతం కలగ కుండా నిబంధనలకు లోబడి గణపతి ఉ త్సవాలను జరుపుకోవాలని ఎస్‌ఐ వీరబా బు అన్నారు. శనివారం మండల కేంద్రం లోని పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయ న మాట్లాడారు. వినాయక చవితి పండగ సందర్భంగా మండలంలోని గ్రామాల్లో గణ పతుల విగ్రహాల మండపాల ఏర్పాటు చే సేందుకు నిర్వాహకులు పోలీస్‌శాఖ అనుమ తులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఉ త్సవాల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివ రాలను పోలీస్‌శాఖ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను సంద ర్శించి వివరాలను నమోదు చేసుకోవాలని చె ప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్ర మంలో ఉత్సవాల నిర్వాహకులు పాల్గొన్నారు.

ఫ వంగూరు, (ఆంధ్రజ్యోతి) : గణేష్‌ ఉత్స వాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్‌ఐ మాధవరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండపాల నిర్వాహకులు పోలీస్‌ శా ఖ పోర్టలో ఆన్‌లైన్‌ ద్వారా తమ వివరాలను రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. మండపా ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల ని, మండపాల నిర్వాహకులు, పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 11:21 PM