సంబరంగా సద్దుల బతుకమ్మ....
ABN , Publish Date - Oct 18 , 2026 | 11:39 PM
జిల్లా కేంద్రంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘ నంగా నిర్వహించుకున్నారు. సంస్కృతి, సం ప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగను మహిళలు 9 రోజులుగా జరుపు కుంటూ బతుకమ్మ ఆడుతున్నారు.
ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు..
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘ నంగా నిర్వహించుకున్నారు. సంస్కృతి, సం ప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగను మహిళలు 9 రోజులుగా జరుపు కుంటూ బతుకమ్మ ఆడుతున్నారు. ఉదయం వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను పూర్చి గౌరమ్మను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. రా త్రి ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉం చి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చే శారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధ రించి డీజే పాటలకు కోలాటాలు ఆడుతూ నృ త్యాలు చేశారు. జిల్లా కేంద్రంలోని వార్డులు బతుకమ్మ పాటలతో మార్మోగి పోయాయి. ఎ టువంటి అవాంచనీయ సంఘ టనలు జరగ కుండా మంచిర్యాల పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో పెట్రోలింగ్ ముమ్మరంగా చే పట్టారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వాగు ల్లో, నీటి కుంటల్లో నిమజ్జనం చేశారు.
నస్పూర్ : నస్పూర్ పట్టణంలో సద్దుల బ తుకమ్మ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఆర్థరాత్రి వరకు బతుకమ్మ ఆటపా టలతో మహిళలు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిపారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ నిమజ్జన కేంద్రాల వద్ద ఆర్థరాత్రి నీటిలో వదలి పెట్టారు. ఈ సందర్భంగా వెంట తీసుకువచ్చిన ప్రసాదా ల ను మహిళలు వాయినంగా ఇచ్చారు. సీసీసీ నస్పూర్ పోలీసులు బందోబస్తు, పెట్రోలింగ్ నిర్వహించారు.