నెట్‌వర్క్ ఉన్నచోట స్మార్ట్‌మీటర్లు తప్పనిసరి
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:01 AM
కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఉన్నచోట స్మార్ట్ మీటర్ల బిగింపు తప్పనిసరి అని కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) తేల్చిచెప్పింది. ఈ మేరకు మీటర్ల ఏర్పాటు, నిర్వహణ నిబంధనలు...
కేంద్ర విద్యుత్ అథారిటీ ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఉన్నచోట స్మార్ట్ మీటర్ల బిగింపు తప్పనిసరి అని కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) తేల్చిచెప్పింది. ఈ మేరకు మీటర్ల ఏర్పాటు, నిర్వహణ నిబంధనలు- 2006ను సవరిస్తూ... 2026 నిబంధనలను సీఈఏ విడుదల చేసింది. కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోని వినియోగదారుల నివాసాల్లో స్మార్ట్ మీటర్లు బిగించాలని, నెట్‌వర్క్ లేనిచోట విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) అనుమతితో ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలని తెలిపింది. ఇక అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌కు అనుసంధానమై... 650 వాట్‌ల కంటే ఎక్కువ వోల్టేజీ కలిగిన ఓపెన్ యాక్సెస్ వినియోగదారులకు రెండు మీటర్లు కేటాయించాలని సూచించింది. వాటిలో ఒకటి వినియోగదారుల ప్రాంగణంలో, రెండో స్టాండ్‌బై మీటర్‌ను వినియోగదారుల ప్రాంగణంలో లేదా సబ్‌స్టేషన్‌లో పెట్టాలని పేర్కొంది. ఇక 650 వాట్‌ల వోల్టేజీకి లోబడి ఓపెన్ యాక్సె్‌సలో కరెంట్ కొనుగోలు చేస్తున్న వారికి ప్రధాన మీటర్‌తో పాటు ఇతర మీటర్లను వినియోగదారుల ప్రాంగణంలోనే పెట్టాలని తెలిపింది.