Share News

పత్తి సేకరణలో సీసీఐ వెనుకంజ...

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:10 PM

జిల్లాలో ఈ సీజన్‌లో పత్తి కోనుగోళ్లలో కేంధ్ర ప్రభుత్వ సంస్థ అయిన కాటన్‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) వెనుకంజ వేసింది. 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి మద్దతు ధర కొంతమేర ఆశాజనకంగా ఉ న్నప్పటికీ కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడం గమనార్హం.

పత్తి సేకరణలో సీసీఐ వెనుకంజ...

-జిల్లాలో పడిపోయిన తెల్లబంగారం కొనుగోళ్లు

-కపాస్‌ యాప్‌లో స్లాట్‌ బుకింగ్‌లకు రైతుల ఇబ్బందులు

-సీజన్‌ ముగియక ముందే కేంద్రాల మూసివేత

-మద్దతు ధరలు ఉన్నా...ప్రైవేటు వైపే మొగ్గు

మంచిర్యాల, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ సీజన్‌లో పత్తి కోనుగోళ్లలో కేంధ్ర ప్రభుత్వ సంస్థ అయిన కాటన్‌ కార్పొ రేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) వెనుకంజ వేసింది. 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి మద్దతు ధర కొంతమేర ఆశాజనకంగా ఉ న్నప్పటికీ కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడం గమనార్హం. పత్తి సీజ న్‌ పూర్తిగా ముగియక ముందే కొనుగోలు కేంద్రాలను మూసివే యడంతో చివరి దఫా పంటను ప్రైవేటు మార్కెట్లో విక్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తక్కువ ధరకు ప్రైవేటు లో విక్రయించిన రైతులు ఆర్థికంగా నష్టాలు చవి చూశారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సీసీఐ సుమారు 16 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కేంద్రాలు మూసి వేసే సరికి అందులో కేవలం ఏడు లక్షల పై చిలుకు క్వింటాళ్ల పంటను మాత్రమే కొనుగోలు చేయగలిగింది. ఇదిలా ఉండగా ఈ ఏడు పత్తి పంటకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ. 8100 పై చిలుకు ఉంది. మద్దతు ధర కొం తమేర ఆశాజనకంగా ఉన్నప్పటికీ లక్ష్యం మేరకు కొనుగోళ్లు నమో దు కాకపోవడం విశేషం.

విక్రయాలపై కపాస్‌ యాప్‌ ప్రభావం...!

ఈ సీజన్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు రైతులు రాకపోవ డానికి అనేక కారణాలు తెలుస్తున్నాయి. ప్రధానంగా ఈ ఏడాది అమలు చేసిన కపాస్‌ యాప్‌లో ముందస్తుగా స్లాట్‌ బుక్‌ చేసుకో వడం రైతులకు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. రైతుల్లో అనేక మంది నిరక్ష్యరాస్యులు ఉండగా, యాప్‌పై కనీస అవగాహన లేనివారు సైతం అధిక సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. యాప్‌లో ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే పత్తి విక్రయించే అవ కాశం ఉండటంతో అవగాహన లేమివల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడ్డట్లు సమాచారం. కేవలం సెల్‌ఫోన్‌ వాడకం, యాప్‌ పై అవగాహన ఉన్న రైతులు మాత్రమే యాప్‌ ద్వారా ముంద స్తుగా స్లాట్‌ బుక్‌ చేసుకోగా, మిగతా వారు చివరి నిమిషంలో ప్రై వేటు మార్కెట్‌ను ఆశ్రయించి, నష్టపోయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సకాలంలో మిల్లుల కేటాయింపుల్లో జాప్యం కూడా కొను గోళ్లపై కొంతమేర ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. అలాగే ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తినే కొనుగోలు చేస్తామని సీసీఐ నిబంధన పెట్టడం కూడా రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో చాలా మంది రైతులు సీసీఐ నిబంధనలతో వి సుగుచెంది ప్రైవేటుకు పత్తిని తరలించారనే అభిప్రాయాలు వ్య క్తమవుతున్నాయి. మరోవైపు అంతర్‌ జిల్లా పత్తి అమ్మకాలపై ఆం క్షలు పెట్టడం కూడా పత్తి కొనుగోళ్లపై ప్రభావం చూపిందని స మాచారం. ఇక అకాల వర్షాలతో చేతిక వచ్చిన పంట నీట తడిచి నాణ్యత లేకుండా పోయింది. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు రావ లసిన దిగుబడి, ఆరేడు క్వింటాళ్లకు మించలేదు. ఇవి కూడా పత్తి కోనుళ్ల లక్ష్యంపై ప్రభావం చూపినట్లయింది.

సీజన్‌ ముగియకముందే సెంటర్లు మూసివేత....

మరోవైపు ఈ ఏడాది పత్తి సీజన్‌ ముగియకముందే జిల్లాలో కొనుగోలు కేంద్రాలు మూసివేయడంతో రైతులు ఇబ్బంది పడక తప్పలేదు. చివరి దఫా పత్తి ఏరివేత మార్చి మొదటి వారం వర కు కొనసాగగా, సీసీఐ కేంద్రాలను మాత్రం వారం, పది రోజులు ముందుగానే మూసివేశారు. దీంతో మూడో దఫా ఏరిన పత్తిని రైతులు ప్రైవేటు మార్కెట్లో విక్రయించక తప్పని పరిస్థితులు నెల కొన్నాయి. జిల్లాలో లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సీసీఐ సెంటర్ల పరిధిలో మొత్తం 11 జిన్నింగ్‌ మిల్లుల ద్వా రా ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు చేపట్టారు. సీసీఐ కేంద్రాలు ముం దస్తుగా మూసివేయడంతో ప్రైవేటు మార్కెట్లో మద్దతు ధర అ మాంతం తగ్గిపోయింది. సీసీఐలో క్వింటా పత్తికి రూ. 8వేల పై చి లుకు ఉండగా, ప్రైవేటులో రూ. 6వేల లోపే ఉండటంతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్లాట్‌తో పనిలేకుండా నేరుగా కొనాల్సింది...

లగిశెట్టి రాజమౌళి, గుడిపేట

పత్తి కొనుగోళ్లకు సంబంధించి కపాస్‌ యాప్‌ తీసుకొచ్చిన ప్పటి కీ, స్లాట్‌ బుకింగ్‌తో సంబంధం లేకుండా నేరుగా కూడా కొనుగోలు చేయాల్సింది. యాప్‌పై అవగాహన లేమి కారణంగా చాలా మంది ప్రైవేటును ఆశ్రయించారు. ఈ సీజన్‌లో ఐదు ఎకరాలు సాగు చేస్తే ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సెంటర్లు ముందస్తుగా మూసివేయడంతో ప్రైవేటు మార్కెట్‌లో క్వింటా రూ. 5,500కే విక్రయించాను. ఓ వైపు అకాల వర్షాలతో దిగుబడి తగ్గి పోగా, మరోవైపు కేంద్రాలను ముందుగానే మూసివేయడం వల్ల నష్టం వాటిల్లింది.

Updated Date - Apr 18 , 2026 | 11:10 PM