Share News

kumaram bheem asifabad- సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ABN , Publish Date - Mar 28 , 2026 | 10:30 PM

మండలంలోని దిందా గ్రామ పంచాయతీలోని కేతిని గ్రామంలో గ్రామంలో సీసీ రోడ్డు పనులకు సర్పంచ్‌ నిర్మల భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను నివారించేందుకు పరిష్కరిస్తామన్నారు. ఈ

kumaram bheem asifabad- సీసీ రోడ్డు పనులు ప్రారంభం
రోడ్డు పనులకు భూమి పూజ చేస్తున్న సర్పంచ్‌

చింతలమానేపల్లి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దిందా గ్రామ పంచాయతీలోని కేతిని గ్రామంలో గ్రామంలో సీసీ రోడ్డు పనులకు సర్పంచ్‌ నిర్మల భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను నివారించేందుకు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శంకర్‌, కాంట్రాక్టర్‌ సుధాకర్‌, రాజ్‌గొండ్‌ సభ్యులు బొంద్యాలు, జమ్మయ్య, రమేష్‌, చంద్రయ్య, రామన్న, మధుకర్‌, సిద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండపల్లి గ్రామ పంచాయతీలోని ఆరెవాడలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సహకారంతో శనివారం సీసీ రోడ్డుకు సర్పంచ్‌ రుక్మాబాయి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ లక్ష్మి, వార్డు సభ్యులు భీమేష్‌, నాయకులు పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామంలో ఎన్‌ఆర్‌ఈ జీఎస్‌ పథకం ద్వారా మంజూరైన సీసీ రోడ్డు పనులను సర్పంచ్‌ చిన్ను శనివారం ప్రారంభించారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా సకాలంలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను కోరారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ, నాగభూషణం, పెంటు, దాదాజీ, శ్రీనివాస్‌, ఎఫ్‌ఏ సోము పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 10:30 PM