సీబీఎస్ఈ పదో తరగతిలో నారాయణ విద్యార్థినికి 494 మార్కులు
ABN , Publish Date - May 15 , 2026 | 04:38 AM
సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని నారాయణ స్కూల్స్ తెలిపింది...
హైదరాబాద్, మే 14(ఆంధ్రజ్యోతి): సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని నారాయణ స్కూల్స్ తెలిపింది. 500 మార్కులకుగాను తమ విద్యార్థి భూమిజ (కర్ణాటక) 494 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచిందని నారాయణ గ్రూప్ డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జస్వంత్ రామ్, మహారాష్ట్ర విద్యార్థి సోహమ్ పెడ్నేకర్ 492 మార్కులు సాధించారని, 27 మంది 485 కంటే అధిక మార్కులు సాధించారని వివరించారు. తమ విద్యాసంస్థల ఉత్తీర్ణత శాతం 94.8గా నమోదైందని తెలిపారు. దశాబ్దాల పరిశోధనలతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కరికులమ్ అందిస్తున్నామని, సీబీఎస్ఈ, ఐసీఎస్‌ఈ, ఇతర స్టేట్ బోర్డుల ఉత్తమ పద్ధతులను మిళితం చేసి విద్యార్థులకు సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.