Share News

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో కేకేఆర్‌ హవా

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:14 AM

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో డా. కేకేఆర్‌ గౌతమ్‌ పాఠశాలల ...

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో  కేకేఆర్‌ హవా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో డా. కేకేఆర్‌ గౌతమ్‌ పాఠశాలల విద్యార్థులు అద్భుత విజయాలు సాధించారు. 500 మార్కులకు గాను పాఠశాల విద్యార్థులు వి.హితేశ్‌ కుమార్‌ 491 మార్కులు, మన్నెం రమ్య 490, బి.సాత్విక్‌ 489, సత్యజిత్‌ 488 మార్కులు సాధించి సత్తా చాటారు. పాఠశాల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణతతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, సిబ్బందికి పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది.

Updated Date - Apr 16 , 2026 | 04:14 AM