Share News

కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:35 PM

విద్యార్థులు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించా లని కల్వకుర్తి డిప్యూటీ డీఎంహెచ్‌ వో భీమానాయక్‌ సూచించారు.

కంటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
కంటి పరీక్షలు నిర్వహిస్తున్న కంటి వైద్య సహాయకుడు వెంకటేశ్‌

- డిప్యూటీ డీఎంహెచ్‌వో భీమానాయక్‌

కల్వకుర్తి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించా లని కల్వకుర్తి డిప్యూటీ డీఎంహెచ్‌ వో భీమానాయక్‌ సూచించారు. జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం కల్వకుర్తి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీ క్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చి న్న వయస్సులోనే దృష్టి లోపాలను గుర్తించి తగిన చికిత్స అందిస్తే విద్యార్థుల చదువుకు ఆటంకం కలగదని అన్నారు. పాఠశాల విద్యార్థు లకు కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని తెలి పారు. కంటి పరీక్షల్లో దృష్టి లోపం ఉన్న విద్యా ర్థులకు త్వరలో ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తామని చెప్పారు. కంటి వైద్య సహాయ కుడు బావండ్ల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో 287 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిం చగా 22 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తిం చారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో శివ శ్రీనివా స్‌, ఆర్‌బీఎస్‌కే వైద్యురాలు డాక్టర్‌ సుఫియా ఖాన్‌, సిబ్బంది ఫాతిమా, ఝాన్సీ, హెచ్‌ఎం చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 11:35 PM