Share News

kumaram bheem asifabad- గుప్పుమంటున్న గంజాయి

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:28 PM

జిల్లాలో గంజాయి దందా కలకలం రేపు తోంది. తరచూ ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతుం డడం, మహారాష్ట్ర నుంచి సరిహద్దులు దాటి మత్త సరుకు జిల్లాలోకి చేరుతుందనే ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపా దం మోపి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రహిత సమాజం కోసం కృషి చేస్తోంది. ఈ విషయంలో పూర్తి స్థాయిలో అధికారులు కృషి చేస్తున్నప్పటికీ కూడా ఈ దందాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు.

kumaram bheem asifabad- గుప్పుమంటున్న గంజాయి
లోగో

- అధికారులు తనిఖీలు చేపడుతున్నా అడ్డుకట్ట పడని వైనం

- యువతే లక్ష్యంగా విక్రయాలు.. తల్లిదండ్రుల్లో ఆందోళన

కాగజ్‌నగర్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి దందా కలకలం రేపు తోంది. తరచూ ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతుం డడం, మహారాష్ట్ర నుంచి సరిహద్దులు దాటి మత్త సరుకు జిల్లాలోకి చేరుతుందనే ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపా దం మోపి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి రహిత సమాజం కోసం కృషి చేస్తోంది. ఈ విషయంలో పూర్తి స్థాయిలో అధికారులు కృషి చేస్తున్నప్పటికీ కూడా ఈ దందాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. తెలంగాణ. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా జరుగుతోంది. మహారాష్ట్రను ఆనుకొని ఉన్న బెజ్జూరు, పెంచికల్‌పేట్‌, కాగజ్‌నగర్‌, వాంకిడి, కెరమెరి మార్గాల గుండా గంజాయి రవాణా కొనసా గుతోంది. జిల్లాలోని వివిధ కేంద్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కాగజ్‌నగర్‌లోని పలు వార్డులు, అలాగే మండలంలోని ఈసుగాం, నజ్రూ ల్‌నగర్‌ క్యాంపులకు కూడా గంజాయి తరలిస్తున్నట్టు ఆరోపణలు న్నాయి. ఈ గంజాయి తీసుకోవడం వల్ల యువత పెడదారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో యువకుల తల్లిదండ్రుల్లో ఆందో ళన నెలకొన్నది.

- చంద్రాపూర్‌, రాజూరా నుంచి..

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, రాజూరా తదితర ప్రాంతాల నుంచి గంజాయి జిల్లాకు చేరుతోంది. మహారాష్ట్ర నుంచి జిల్లాకు రావాలంటే రెండు మార్గా లు ఉన్నాయి, ఈ మార్గాల ద్వారా రాత్రి వేళల్లో తరలించి లాభాలు గడిస్తున్నారు. జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించి అక్రమ రవాణా చేసే మార్గాలపై గట్టి నిఘా పెట్టింది. కళాశాలల్లో ప్రత్యేక అవగాహన సదస్సులను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాగా జిల్లాలో కాగజ్‌నగర్‌ ఈసు గాంలో 2024 ఆగస్టు 30న టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో కూడా మహారాష్ట్ర నుంచి తరలించినట్టు నిర్ధారణ జరిగింది. 2026 అక్టోబరు 19న కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి 5.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. 2026 అక్టోబరు 12న జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి 150 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నారు.

- వ్యసనాల బారిన పడితే..

యువత గంజాయి బారిన పడితే దాన్ని మానుకో వడం కష్టంగా మారుతుంది. గంజాయి తీసుకోవడం తో మెదడుపై పెను ప్రభావం పడుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా జ్ఙాపకశక్తి క్షీణత, మానసిక సమస్యలు అధికంగా వచ్చే అవకా శాలుంటాయి, అలాగే మెదడు అభివృద్ధిపై ప్రతి కూల ప్రభావం ఉంటుంది. అలాగే గుండె వేగంగా కొట్టుకోవటం, రక్తపోటులో మార్పులు, పొగ రూపం లో తీసుకుంటే ఊపిరితిత్తులపై ప్రభావం, దీర్ఘకాలిక దగ్గు, శ్వాస కోశ సమస్యలు, వాంతులు, తలతిర గడం వంటి సమస్యలు అధికంగా వచ్చే అవకాశా లున్నాయి. అఽధికంగా మద్యం సేవిస్తే నిద్ర లేమి, తీసుకోకపోతే చిరాకు, ఆకలి దగ్గటం వంటి లక్షణాలు వచ్చి క్రమేణ బలహీనపడతారు. దీర్ఘకా లిక అనారోగ్యాలు తలెత్తుతాయి. యువత వ్యసనాల బారిన పడొద్దని, లక్ష్యం కోసం క్రమశిక్షణ పాటిం చాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

గంజాయి తరలిస్తే కఠిన చర్యలు..

-వహిదుద్దీన్‌, కాగజ్‌నగర్‌ డీఎస్పీ

గంజాయి తరలించే వారిపై కఠిన చర్యలు తీసు కుంటాం. మహారాష్ట్ర నుంచి వచ్చే దారులపై గట్టి నిఘా పెట్టాం. విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. కళాజాతా బృందాలతో ప్రత్యే కంగా అన్ని గ్రామాల్లో గంజాయి తీసుకోవడం వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కల్పిస్తున్నాం.

Updated Date - Nov 17 , 2026 | 10:28 PM