kumaram bheem asifabad- కుమరం భీం జిల్లాలో గంజాయి కలకలం
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:29 PM
కుమరం భీం జిల్లాలో గంజాయి రవాణా కలకలం రేపుతోంది. కొందరు అక్రమార్కులు మహారాష్ట్రలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి జిల్లా మీదుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ అక్రమంగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా మీదుగా మంచిర్యాల, హైదరాబాద్ ప్రాంతాలకు ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గంజాయి స్మగ్లర్లు కొత్తదారులు ఎంచుకొని మహారాష్ట్ర నుంచి ఎండు గంజాయిని గుట్టుగా తరలిస్తున్నారు.
- ఇటీవల బెజ్జూరులో పట్టుబడ్డ ఎండు గంజాయి
- మత్తుకు బానిస అవుతున్న యువత
ఆసిఫాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లాలో గంజాయి రవాణా కలకలం రేపుతోంది. కొందరు అక్రమార్కులు మహారాష్ట్రలో తక్కువ ధరలకు కొనుగోలు చేసి జిల్లా మీదుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ అక్రమంగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా మీదుగా మంచిర్యాల, హైదరాబాద్ ప్రాంతాలకు ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గంజాయి స్మగ్లర్లు కొత్తదారులు ఎంచుకొని మహారాష్ట్ర నుంచి ఎండు గంజాయిని గుట్టుగా తరలిస్తున్నారు. ఇటీవల బెజ్జూర్ మండలం సులుగుపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఈనెల 5న పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా మంచిర్యాల ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు వారు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి రూ. 90 వేల విలువైన 3.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బైక్, రెండు సెల్‌ఫోన్లు సీజ్ చేసి మంచిర్యాలకు చెందిన తోకల తిరుపతి, చెన్నూర్‌కు చెందిన పైడిపల్లి రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో స్మగ్లర్ల ప్రలోభాలకు గురై గంజాయి సాగు చేస్తున్నారు. గతేడాది జిల్లాలో 73 గంజాయి రవాణా కేసులు నమోదు కాగా 15 కిలోల గంజాయి, 1,118 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
ఫ ప్యాకెట్లుగా మార్చి విక్రయాలు..
ఇటీవల జిల్లాలో పట్టుబడిన నిందితులు ఎండుగంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. జిల్లాలోని సరిహద్దు మండలాలైన కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, వాంకిడి, సిర్పూర్(టి) మండలాల మీదుగా మహారాష్ట్ర నుంచి అక్రమంగా రాష్ట్రంలోని మంచిర్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు తరలిస్తున్న మూడు కిలోల గంజాయిని బెజ్జూరు పోలీ సులు పట్టుకున్నారు. చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరిం చారు. కొన్ని ప్రాంతాల్లో సిగరేట్లలో నింపుతూ ఎవరికి అనుమానం రాకుండా గుట్టుచప్పు డు రాకుండా ప్రత్యేక కోడ్‌తో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 10 గ్రాముల నుంచి 100 గ్రాము ల ప్యాకెట్‌ను రూ.300 నుంచి రూ. 1000 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఫ తనిఖీలు చేపడుతున్నా..
జిల్లాలో గంజాయి సాగును అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్న ఇతర ప్రాంతాలనుంచి దిగుమతికి అడ్డుకట్ట పడటం లేదు. చదువుకునే వయస్సులోనే యువత గ్యాంగ్‌లుగా మారి గంజాయి వ్యసనానికి బానిసవుతున్నారు. మొబైల్స్ ద్వారా సమాచా రాన్ని పంచుకుంటున్నారు. అలవాటు పడ్డ యువత స్మగర్లకు అందుబాటులో ఉంటున్న ట్లు చెబుతున్నారు. మద్యంతో పోలిస్తే గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న వాటిని యువత వదలలేక పోతున్నారు. గంజాయిలోని టెట్రా హైడ్రోకానాబినాల్ రసాయనం మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు, లాలాజలంలో 24 గంటలు, రక్తంలో 12 గంటల పాటు ఉంటుందని వైద్య నిపు ణులు చెబుతున్నారు. యువత వ్యసనాన్ని మానకపోతే తీవ్ర అనారోగ్యానికి గురై మర ణానికి సైతం దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు.