kumaram bheem asifabad- గంజాయి సాగును అరికట్టాలి
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:54 PM
జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, గంజాయిసాగు, రవాణాను అరికట్టాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ నితికాపంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి గురువారం మాదక ద్రవ్యాల నియంత్రణపై సంబంధితశాఖల అదికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, గంజాయిసాగు అరికట్టడంలో అదికారులు సమన్వయంతో కృషిచేయాలన్నారు.
ఆసిఫాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, గంజాయిసాగు, రవాణాను అరికట్టాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో ఎస్పీ నితికాపంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి గురువారం మాదక ద్రవ్యాల నియంత్రణపై సంబంధితశాఖల అదికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, గంజాయిసాగు అరికట్టడంలో అదికారులు సమన్వయంతో కృషిచేయాలన్నారు. గంజాయిసాగు రవాణాకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాలు తీసుకోవడంవల్ల కలిగే నష్టాలను వివరించాలని తెలిపారు. హోటళ్లు, దాబాలలో తనిఖీలు చేపట్టాలని మందుల షాపులలో నిషేదిత అధిక మోతాదు మందులను పరిశీలించాలని ఆదేశించారు. నషాముఖ్త్ భారత్ అభియాన్‌లో బాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్పీ నితికాపంత్ మాట్లాడుతూ జిల్లాలో అక్టోబరు మాసంలో గంజాయిసాగు, రవాణాపై తనిఖీలు చేపట్టి 16 కేసులు నమోదు చేశామని చెప్పారు. గంజాయిసాగు చేసే వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయిసాగు, రవాణా, వినియోగంపై పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవోలోకేశ్వర్‌రావు, డీఎస్పీ అశోక్, డీపీవో భిక్షపతి, డీడీ జాదవ్ అంబాజీ, డీఎంహెచ్‌వో నాగేంద్ర సిడాం, డీఐఈవో కళ్యాణీ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశానికి ఎస్పీ నితికాపంత్, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి హజరై మాట్లాడారు. జాతీయ రహదారిపై తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి వెంటనే తరలించాలన్నారు. ప్రధానమంత్రి రాహత్ పథకం కింద ప్రమాదంలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందించే అవకాశం ఉందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపకూడదని అ దిశగా అదికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రహదారులపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని చెప్పారు. మూలమలుపుల వద్ద చెట్ల కొమ్మలు, పిచ్చి మొక్కలను తొలగించాలని తెలిపారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో రహదారులపై పశువులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పశువుల యాజమానులకు నోటిసులు జారీ చేయాలని ఆదేశించారు. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎస్పీ నితికాపంత్ మాట్లాడుతూ జిల్లాలో నెలరోజుల వ్యవధిలో రహదారుల ప్రమాదాలలో ఏడుగురు మృతిచెందారన్నారు. అతివేగంగా మద్యం సేవించి వాహనా లు నడుపకూడదని సూచించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఎస్పీ అశోక్, అర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు.