అభ్యర్థులు ఫైనల్...
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:55 PM
ముసినిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్ర క్రియ మంగళవారంతో ముగిసింది. గత నెల 28 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా 30వ తేదీన ము గిసింది. మొదటి రెండు రోజుల్లో అభ్యర్థుల నుంచి ఓ మోస్తరు స్పందన లభించింది.
-తుది జాబితా విడుదల
.....నామినేషన్లు ఉపసంహరణ
-బీ ఫాంలు అందజేసిన ముఖ్య నేతలు
-ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద
మంచిర్యాల, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ముసినిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్ర క్రియ మంగళవారంతో ముగిసింది. గత నెల 28 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా 30వ తేదీన ము గిసింది. మొదటి రెండు రోజుల్లో అభ్యర్థుల నుంచి ఓ మోస్తరు స్పందన లభించింది. చివరి రోజున పెద్ద మొ త్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని మంచి ర్యాల మునిసిపల్ కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, చె న్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట మునిసిపాలిటీల్లో ఎన్ని కలు జరుగుతుండగా, మొత్తంగా 149 వార్డు సభ్యుల స్థానాల్లో అభ్యర్థులు తలపడనున్నారు. మంచిర్యాల కా ర్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్‌లు, బెల్లంపల్లి మునిసి పాలిటీలో 34 వార్డులు, క్యాతన్‌పల్లిలో 22, చెన్నూరులో 18, లక్షెట్టిపేటలో 15 వార్డులు ఉండగా వివిధ పార్టీల నుంచి ఆశావహులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు పోటెత్తారు.
.....నామినేషన్లు ఉపసంహరణ....
జిల్లాలోని ఒక కార్పొరేషన్, నాలుగు మునిసిపాలి టీ లకు సంబంధించి మొత్తం.....నామినేషన్లు ఉపసంహర ణకు గురయ్యాయి. ఈ మేరకు అధికారులు బరిలో ని లిచే వివిధ పార్టీలు, స్వతంత్రుల తుది జాబితాను మం గళవారం విడుదల చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులతో పాటు ఇతర గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రుల్లో అనేక మంది చివరి రో జు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. వారంతా తమ మాతృ పార్టీ తరుపున బరిలో నిలిచిన అభ్యర్థుల కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు.
బీ ఫాంల అందజేత....
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో వివిధ పార్టీల ముఖ్య నేతలు తమ అభ్యర్థులకు బీ ఫాంలు అందజేశారు. అభ్యర్థులు తమ బీ ఫాంలను ఎన్నికల అధికారులకు అందజేయనుండగా, అప్పుడే వారి అభ్యర్థిత్వం ఖరారు కానుంది. మంచిర్యాల కార్పొరే షన్, లక్షెట్టిపేట మునిసిపాలిటీలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు స్థానిక ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావు బీ ఫాంలు అందజేశారు. బీజీపీ తరుపున బరిలో నిలవనున్న అభ్యర్థులకు ఆ పార్టీ జాతీ య కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బీ ఫాంలు అందజేయగా, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అందజేశారు. అలాగే బెల్లంపల్లి మునిసిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్, బీజేపీ అఽభ్యర్థులకు గుజ్జుల ప్రేమేంధర్‌రెడ్డి, బీ ఆర్‌ఎస్ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బీ ఫాంలు అందజేశారు. చెన్నూరు, క్యాతన్‌పల్లి మునిసి పాలిటీల కాంగ్రెస్ అభ్యర్థులకు రాష్ట్ర మంత్రి గడ్డం వివే కానంద, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షు డు బాల్క సుమన్, బీజేపీ అభ్యర్థులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ బీ ఫాంలు అందజేశారు.
ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద...
నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగియడంతో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద పొంచి ఉంది. జిల్లాలో ని మంచిర్యాల కార్పొరేషన్‌తో సహా అన్ని మునిసిపా లి టీల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నుం చి వార్డుల సంఖ్యకు మించి నామినేషన్లు దాఖల య్యా యి. పార్టీల ముఖ్యనేతల సూచనల మేరకే ఒక్కో వా ర్డుకు ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థు లుగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల వారీ గా ఒక్కో వార్డుకు ఒక అభ్యర్థి మాత్రమే బరిలో నిలవా ల్సి ఉంది. ఈ క్రమంలో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన వారు కొన్ని చోట్లా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. దీంతో వారంతా ఆయా పార్టీల కు రెబల్స్‌గా బరిలో నిలవనున్నారు. ఈ నేపథ్యంలో రెబల్స్ కారణంగా పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థుల ఓ ట్లు చీలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మేలు జరిగే ప్రమాదం పొంచి ఉంది. మంచిర్యాల కార్పొరేషన్‌కు సంబంధించి కాంగ్రెస్ నుంచి డివిజన్ల సంఖ్యకు మించి కేవలం 17 నామినే షన్లు ఎక్కువగా దాఖలయ్యాయి. ప్రస్తుతం వారంతా తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా, కాంగ్రెస్ పా ర్టీకి ఇక్కడ రెబల్స్ బెడద తప్పినట్లయింది. మిగతా చోట్లా రెబల్స్ బెడద లేకుండా వివిధ పార్టీల ముఖ్య నేతలు అసంతృప్తులను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.