kumaram bheem asifabad- క్యాన్సర్‌ను నివారించాలి
ABN , Publish Date - Feb 04 , 2026 | 10:32 PM
జిల్లాలో క్యాన్సర్ వ్యాధి నివారణకు వైద్య, ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ 2.0లో భాగంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, శిక్షణ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్ కుమార్‌లతో కలిసి హాజరయ్యారు.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 4 (ఆంఽధ్రజ్యోతి): జిల్లాలో క్యాన్సర్ వ్యాధి నివారణకు వైద్య, ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ 2.0లో భాగంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, శిక్షణ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్ కుమార్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి విస్తరించకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. క్యాన్సర్, క్షయ వంటి రోగాలను ప్రాథమిక దశలలో గుర్తించి తగిన చికిత్సలు అందించినట్లయితే తొలి దశలో నిర్మూలించవచ్చని తెలిపారు. స్వయం సహయక సంఘాల సభ్యులు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిలో ఎన్నో రకాలు ఉన్నాయని అన్నారు. వ్యాధుల పట్ల ఎలాంటి భయం ఉండకూదని చెప్పారు. జిల్లాలో 128 కేసులు ఉన్నాయని వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ భవన సమావేశ మందిరంలో సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించు కొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అదనపు కలెక్టర్ డేవిడ్, శిక్షణ ఐఎఫ్‌ఎస్ అధికారి భార్గవ్‌కుమార్‌లతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆశా, ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూడాలి
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): చెరువులను చిత్తడి నేలగా గుర్తించి వాటిని ఆక్రమణకు గురికాకుండా చూడాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం చెరువులను చిత్తడి నేలగా గుర్తింపుపై జిల్లా అటవీ శాఖాధికారి నీరజ్‌కుమార్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డివిజన్ అధికారి అప్పయ్య, ట్రైనీ ఐఎఫ్‌ఎస్ భార్గవ్‌కుమార్‌తో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో చిత్తడి నేలల కింద చెరువులను గుర్తించి రక్షించాలని నేలగా గుర్తించామని అన్నారు., దీని వల్ల చెరువులు అక్రమణకు గురి కాకుండా కట్టడి చేసే అవకాశం ఉందని తెలిపారు. చెరువును అభివృద్ధి చేససి నీటి సామర్థ్యం పెంచడం ద్వారా రైతులకు సాగునీరు అందించవచ్చన్నారు. పశువులకు తాగునీరు అందుబాటులో ఉంటుందని, రకరకాల పక్షులు వసల రావడం ద్వారా పర్యాటక రంఘం అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. తిర్యాణి మండలంలోని చెలిమెల ప్రాజెక్టును చిత్తడి నేలగా గుర్తించి అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, జిల్లా వ్యవసాయాధికారి వెంకటి, జిల్లా మత్స్యశాఖాధికారి సాంబశివరావు, నీటి పారుదల శాఖ ఈఈ గుణవంతరావు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.