Share News

kumaram bheem asifabad- కోరలు చాస్తున్న క్యాన్సర్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 10:35 PM

జిల్లాలో క్యాన్సర్‌ మహమ్మరి కోరలు చాస్తోంది. ఏటా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 128 క్యాన్సర్‌ కేసులు నమోదు కావడం తో ఆరోగ్య నిఫుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్‌ బారిన పడుతున్న వారిలో 30 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు మహిళల్లో 35 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో క్యాన్సర్‌ కేసులు పెరగడానికి తంబాకు, గుట్కా, కర్ర, మద్యం సేవించడం కారణమని వైద్యులు చెబుతున్నారు. రోజు తినే గుట్కాతో పాటు సరిహద్దులోని మహారాష్ట్రలో లభించే కర్ర సైతం మన దగ్గర లభిస్తుం డడంతో యువతతో పాటు ప్రజలు అధికంగా నమలడం వల్లనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

kumaram bheem asifabad- కోరలు చాస్తున్న క్యాన్సర్‌
లోగో

- ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆరోగ్య నిపుణులు

- సకాలంలో గుర్తిస్తే చికిత్స తేలిక

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్యాన్సర్‌ మహమ్మరి కోరలు చాస్తోంది. ఏటా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 128 క్యాన్సర్‌ కేసులు నమోదు కావడం తో ఆరోగ్య నిఫుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్‌ బారిన పడుతున్న వారిలో 30 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు మహిళల్లో 35 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో క్యాన్సర్‌ కేసులు పెరగడానికి తంబాకు, గుట్కా, కర్ర, మద్యం సేవించడం కారణమని వైద్యులు చెబుతున్నారు. రోజు తినే గుట్కాతో పాటు సరిహద్దులోని మహారాష్ట్రలో లభించే కర్ర సైతం మన దగ్గర లభిస్తుం డడంతో యువతతో పాటు ప్రజలు అధికంగా నమలడం వల్లనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పురుషుల్లో నోటి, గొంతు, జీర్ణాశయం, మహిళల్లో రొమ్ము, గర్భాశయ అధికంగా కనిపిస్తున్నాయి. క్యేన్సర్‌ బారిన పడుతున్న వారిలో 30 ఏళ్లలోపు కూడా ఉంటున్నారు. తంబాకు, ఖైనీ, గుట్కా, మద్యం వంటి అలవాట్లతో నోటి, లంగ్‌, లివర్‌, క్యాన్సర్‌ బారిన పడుతన్నా రని డాక్టర్లు చెబుతున్నారు. వీఐఏ టెస్టు తప్పనిసరి చేసుకొవాలి. మహిళలు 30 ఏళ్ల వయస్సు దాటాక ప్రతి నాలుగు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి వీఐఏ (విజువల్‌ ఇన్స్‌పెక్షన్‌ విత్‌ ఆక్టిక్‌ ఆసిడ్‌) టెస్టు చేయించుకొవాలి. క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటే ఈ టెస్టులో ముందే గుర్తించి రాకుండా అడ్డుకట్ట వేయచ్చు. వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్‌ఎంల దగ్గర ప్రతి పీహెచ్‌సీలో ఈ టెస్టు చేసుకునే సదుపాయాలు ఉన్నాయి.

- అవగాహన లేక..

మారుమూల పల్లెలు, గూడెలు, తండాల్లో నివసించే ఆదివాసీ, గిరిజన తెగల మహిళల్లో ఆరోగ్య అవగాహన లోపం ఆందోళన కలిగిస్తోంది. కనీస అవగాహన లోపం కారణంగా ప్రాణాలు పనంగా పెట్టుకుంటున్నారు. రుతుశ్రావం సమయంలో అధిక రక్తస్రావం, భరించలేని కడుపునొప్పి, నెలసరి రుతు క్రమం వంటి సమస్యలు ఉన్న చాలా మంది మహిళలు వాటిని బయటికి చెప్పుకోవడం లేదు. ఇది సాధారణమే అని భావించి చెప్పుకుంటే అవతలి వాళ్లు ఏం అనుకుంటారో అన్న సందేహం వల్ల సమస్యలు తీవ్రత అధికమయ్యే అవకాశాలు లేకపోలేవు. రొమ్ములో గడ్డలు రావడం, నీరు కారడం వంటి లక్షణాలు కనిపించినా తొలిదశలో గుర్తించక పోవడం మరింత ప్రమాదకరమని వైద్య ఆరోగ్యశాఖ నిపుణులు తెలుపుతున్నారు. చాలా కేసుల్లో మహిళలు చివరి దశలోనే ఆసుపత్రులకు వస్తున్నారు. అప్ప టికీవ్యాధి తీవ్రంగా మారి చికిత్స కష్టతరం అవు తోందని వైద్యుల అభిప్రాయం. శుభ్రత, పోషకాహారం, వైద్య పరీక్షల అవసరం వంటి విషయాల్లో సరైన అవగాహన అవసరం ఉండాలన్నది ప్రతి గ్రామానికి చేరాలి. చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యులను సంప్రదిస్తే ప్రాణాంతక వ్యాధులను కూడా అడ్డుకొవచ్చని చెబుతున్నారు. కాగాపొగాకు ఉత్పత్తు వినియోగం, మద్యం అల వాట్లకు దూరంగా ఉండడం ద్వారా వ్యాధి బారిన పడే అవకాశం ఉండదని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజు వ్యాయమం చేయడం ద్వారా బరువు అదుపులోకి ఉంచుకో వడం వల్ల క్యేన్సర్‌ బారిన పడకుండ ఉండవచ్చు. పురుషుల్లో పొగాకు, మద్య పానం అలవాట్లు కారణం అవుతుండగా, మహిళల్లో జన్యుపరమైన అంశాలు, కొన్ని రకాల వైరస్‌ల వల్ల రొమ్ము, గర్భాశయ క్యేన్సర్‌ వస్తున్నాయి. 40 ఏళ్లు దాటిన వారు క్యేన్సర్‌ నిర్ధారణ టెస్టులు చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.

- ఆధునాతన వైద్య పరీక్షలు..

క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే ఆధునాతన పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. సకాలంలో గుర్తిస్తే ఆడ్వాన్స్‌డ్‌ వైద్య పద్ధతులతో రోగులు జీవించే కాలాన్ని పెంచగలుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గతంలో నాలుగో స్టేజీలో ఉన్న రోగులు నాలుగు నెలలకు మించి బతకని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం నాలుగేళ్లకు పైబడి జీవించేలా చేస్తున్నారని చెబుతున్నారు. క్యేన్సర్‌ బారిన పడుతున్న వారు 51 శాతం పురుషులు, 49 శాతం మంది మహిళలు ఉన్నారు.

అవగాహన కల్పిస్తున్నాం..

- సీతారాం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

క్యాన్సర్‌ మహమ్మరి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అనుమానం లేకుండా టెస్టులు చేయించుకోవడం ద్వారా వ్యాధిని సకాలంలో అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. వయస్సుతో సంబంధం లేకుండా పొగాకు, గుట్కా, మద్యం తాగడం వల్ల వ్యాధి బారిన పడుతున్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు తీసకోవడం ద్వారా ఆరోగ్య, ఆర్థిక సమస్యలు వస్తా యి. కుటుంబం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. ఈ మహమ్మరిని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి.

Updated Date - Apr 09 , 2026 | 10:35 PM