క్యాంపు రాజకీయాలు షురూ!
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:59 AM
రాష్ట్రవ్యాప్తంగా 24 మునిసిపాలిటీల్లో హంగ్ ఏర్పడ్డం.. 16న మేయర్, చైర్మన్ పదవులకు ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో..
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 24 మునిసిపాలిటీల్లో హంగ్ ఏర్పడ్డం.. 16న మేయర్, చైర్మన్ పదవులకు ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో.. అధికారం కోసం అన్ని పార్టీలూ ప్రలోభాల పర్వానికి తెరదీసినట్లు ప్రచారం జరుగుతోంది. అదేసమయంలో గెలిచిన తమ తమ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కాపాడుకునేందుకు.. చేజారిపోకుండా చూసుకునేందుకు.. ఆయా పార్టీలు వారిని ‘సురక్షిత’ కేంద్రాలకు తరలించినట్టు తెలుస్తోంది. బీజేపీ తమ పార్టీ ప్రజాప్రతినిధులను మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌తో పాటు అయోధ్యకు తరలించగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తమ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను హైదరాబాద్ శివారు ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.