ముమ్మరంగా ప్రచారం....
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:33 PM
మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కార్పొరేటర్/కౌన్సిల్ అభ్యర్థు లు పూర్తిగా ప్రజా క్షేత్రంలోనే గడుపుతున్నారు. ఉద యం నుంచి రాత్రి వరకు ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
-జోరు పెంచిన ’మునిసిపల్’ అభ్యర్థులు
-మందీ మార్బలంతో వార్డుల్లో విస్తృత పర్యటన
-ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మిలాఖత్
మంచిర్యాల, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కార్పొరేటర్/కౌన్సిల్ అభ్యర్థు లు పూర్తిగా ప్రజా క్షేత్రంలోనే గడుపుతున్నారు. ఉద యం నుంచి రాత్రి వరకు ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ మద్దతుదారుల తరుపున ప్రచారాలను ముమ్మరం చేశాయి. జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు నిత్యం ప్రజల మధ్యనే గడుపుతూ వారి మద్దతు కోసం ప్రయ త్నిస్తున్నారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ తమను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపడతారో ఓటర్లకు వివరిస్తున్నారు. మైకులతో ప్రచారం నిర్వహిం చేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లను చేసుకుంటు న్నారు. వార్డుల్లో మందీమార్బలంతో నాయకులు, కార్య కర్తలు ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుంటూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పోటా పోటీగా ప్రచారం...
ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీల మద్దతున్న అ భ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకరికి మించి మరొ కరు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆక ట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విమర్శలు, ప్రతి వి మర్శలతో దాదాపు 14 గంటల పాటు ప్రజల మద్య గ డుపుతున్నారు. ఉదయం 6 గంటలకే ప్రజల్లోకి వెళుతు న్న నాయకులు రాత్రి పదింటికి గాని ఇళ్లు చేరడం లేదు. మునిసిపల్ ఎన్నికలు ఈ నెల 11వ తేదీన జరు గనున్నాయి. ప్రచారానికి మరో వారం రోజులు మాత్ర మే గడువు ఉండటంతో ఆయా వార్డుల్లో అభ్యర్థులు ప్ర చార హోరు పెంచారు. అల్పాహారం మొదలుకొని రాత్రి భోజనం వరకు ప్రజలతోనే కానిస్తున్నారు. ప్రధాన పా ర్టీల మద్దతున్న అభ్యర్థుల నడుమ విపరీతమైన పోటీ ఉన్న కారణంగా గెలుపే లక్ష్యంగా ఎవరికి వారే ముమ్మర పోరాటం చేస్తున్నారు.
కుటుంబ సమేతంగా....
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వారి కుటుంభాల సమేతంగా పాల్గొంటూ బిజీబిజీగా గడు పుతున్నారు. ఇంటిల్లిపాది తలో దారిలో ఇంటింటికి వెళు తూ ఓటర్లతో మిలాఖత్ అవుతున్నారు. జిల్లాలోని ఎన్నికలు జరుగనున్న మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట మునిసి పాలిటీల పరిధిలో ప్రధాన పార్టీల నేతల కుటుంబ స భ్యులను ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని ప్రత్యేకంగా ర ప్పించుకోవడం ద్వారా ఎన్నికల ప్రచారం మరింతగా ముమ్మరం చేసే యత్నాల్లో ఉన్నారు. మంచిర్యాల కార్పొ రేషన్‌తోపాటు లక్షెట్టిపేట మునిసిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ విస్తృతంగా ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ తరుపున మాజీ ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్, బీజేపీ తరుపున ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు రఘునాథ్ వెరబెల్లి ముమ్మర ప్రచారం నిర్వ హిస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి మునిసిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా అక్క డి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తోపాటు ఇతర ముఖ్య కార్య కర్తలు ప్రచార వేగం పెంచారు. అక్కడ బీఆర్ఎస్ త రుపున మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిత్యం వార్డు ల్లో పర్యటిస్తూ ఓటర్లతో మమేకం అవుతున్నారు. బీ జేపీ తరుపున ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొయ్యల హే మాజీతోపాటు పలువురు నాయకులు ప్రచారంలో తల మునకలవుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ని చె న్నూరు, క్యాతన్‌పల్లి మునిసిపాలిటీల్లో కాంగ్రెస్ తరు పున మంత్రి గడ్డం వివేకానంద, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతోపాటు ముఖ్య కార్యకర్తలు నిత్యం ప్రచారం లో పాల్గొంటున్నారు. మునిసిపాలిటీ పరిధిలోని రామకృ ష్ణాపూర్ డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి స్వగ్రామం కావడంతో ఆయన మునిసిపల్ ఎన్నికల్లో అలుపెరగని ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ తరుపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ నాయకుడు డా. రాజా రమేష్ సైతం ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల తరుపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, సీనియర్ నాయకుడు దుర్గం అశోక్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
అభివృద్ధి చేసే వారికే పట్టం....
మునిసిపల్ ఎన్నికల్లో వార్డులను అన్ని విధాలా అభి వృద్ధి చేయగలిగే వారినే కౌన్సిలర్ లేదా కార్పొరేటర్‌గా ఎన్నుకోవాలనే పట్టుదలతో ఓటర్లు ఉన్నారు. మునిసి పల్ ఎన్నికల్లో పార్టీల టికెట్ మీదనే అభ్యర్థులు పోటీ చేస్తుండగా, అభ్యర్థుల వ్యక్తిగత చరిత్ర ఆధారంగానే ఎ క్కువ ఓట్లు పోలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్ర మంలో ఓటర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ పట్టంగట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అభ్యర్థుల పూర్వపు చరిత్ర, స్థానిక సమస్యలపై పూర్తిస్థాయిలో అ వగాహన కలిగి ఉండి, అభివృద్ధి చేయాలనే ధృడ సం కల్పం ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చేందుకు ఓటర్లు సి ద్ధపడుతున్నారు. ఓటర్లలో విద్యావంతులైన యువత అ ధికంగా ఉండటంతో తమ వార్డులను అన్నివిధాలా అ భివృద్ధి పయనంలో నడిపించేందుకు సరైన అభ్యర్థినే ఎన్నుకోవాలనే నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది.