Share News

kumaram bheem asifabad-ప్రచార హోరు

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:21 PM

మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జిల్లాలోని రెండు పురపాలికలు 50 వార్డుల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రె స్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు సైతం రంగంలోకి దిగా రు. రెండు మున్సిపాలిటీలలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలతో పాటు సీపీఎం, బీఎస్పీ, ఎంఐఎం, జనసేన, సీపీఐ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు.

kumaram bheem asifabad-ప్రచార హోరు
లోగో

- పరిస్థితి సానుకూలతకు అభ్యర్థుల యత్నాలు

- అధిక స్థానాలు కైవసం చేసుకోవడంపై నేతల దృష్టి

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జిల్లాలోని రెండు పురపాలికలు 50 వార్డుల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రె స్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు సైతం రంగంలోకి దిగా రు. రెండు మున్సిపాలిటీలలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలతో పాటు సీపీఎం, బీఎస్పీ, ఎంఐఎం, జనసేన, సీపీఐ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. మంగళవా రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం తో బరిలో ఉన్న అభ్యర్థుల సంబంధించిన బీఫారాల ను ఆయా పార్టీల ఆదినాయకులు ఎన్నికల అధికా రులకు అందజేశారు. రెండు మున్సిపాలిటీలలో అభ్య ర్థుల తుది జాబితాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు వాడీవేడిగా జరుగనున్నాయి. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. వార్డుల వారీగా తమ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, పార్టీ అగ్రనేతలు ప్రచారంపై ఫోకస్‌ పెంచాయి. ప్రచారంలో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి.

- అభివృద్ధి మంత్రంతో అధికార పార్టీ..

జిల్లాలోని రెండు మున్సిపాలిటీలలో అధికార కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకునేందుకు వ్యూహలు రచిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన అభి వృద్ధి, సంక్షేమ పథకాలను ముందుంచుతూ వాటిని ప్రచార అస్త్రాలుగా ఓటర్లను తమవైపుకు తిప్పుకునేం దుకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలి టీలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్‌, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కులు 20 వార్డుల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు దిశగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఎమ్మెల్సీ దండె విఠల్‌ 30 వార్డుల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలుపే లక్ష్యంగా ముందుకు వెళు తున్నారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ లలో అత్యధిక స్థానాలను గెలుపొంది చైర్మన్‌ పీఠం దక్కించుకు నేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

- కేంద్ర పథకాలతో బీజేపీ..

మున్సిపల్‌ ఎన్నికలను బీజేపీ సవాలుగా తీసుకుం ది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తోంది. ఆసిఫా బాద్‌ మున్సిపాలిటీలో వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ జిల్లా కన్వీనర్‌ అరిగెల నాగేశ్వర్‌రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లిఖార్జున్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు బోనగిరి సతీష్‌బాబు, సెర్ల మురళీ, ఖాండ్రే విశాల్‌లు అన్ని వార్డుల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, మాజీ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్ని వార్డుల్లో పర్యటిస్తున్నారు. బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించుకునేలా ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ..

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి, రెం డేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడు తూ బీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఆ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ జడ్పీ ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు ఆధ్వర్యంలో పార్టీ ప్రకటించిన వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. వార్డుల వారీగా పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేపడు తున్నారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల లో అధికార పార్టీకి బలమైన పోటీ ఇచ్చి ఎక్కువ స్థానాల్లో గెలుపొంది చైర్మన్‌ పదవులను దక్కించు కునేందుకు పావులు కదుపుతున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:21 PM