Share News

రేవంత్‌ సర్కారుకు కాగ్‌ నివేదిక చెంపపెట్టు!

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:07 AM

రాష్ట్ర ఆర్థిక విధానాలు, రేవంత్‌రెడ్డి సర్కారు పనితీరును కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) కడిగి పారేసిందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు.

రేవంత్‌ సర్కారుకు కాగ్‌ నివేదిక చెంపపెట్టు!

  • బీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీశ్‌రావు

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక విధానాలు, రేవంత్‌రెడ్డి సర్కారు పనితీరును కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) కడిగి పారేసిందని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు అన్నారు. కాగ్‌ తాజా నివేదిక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్‌ అంతా అంకెల గారడి అని, ఆర్థిక క్రమశిక్షణను గాలికి వదిలేశారని సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. మిగులు ఆదాయ రాష్ట్రంగా తాము అప్పగిస్తే.. కాంగ్రెస్‌ ఏడాదిలోనే భారీ లోటులోకి నెట్టేసిందని ఆరోపించారు. 2023-24లో రూ.779 కోట్ల మిగులు ఉంటే.. రేవంత్‌రెడ్డి పాలనలో అది ఏకంగా రూ.9,420 కోట్ల లోటుకు చేరిందని అన్నారు. కరోనాకాలంలో తప్ప ఎప్పుడూ ఇంతటి దారుణ పరిస్థితి లేద ని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమ మాటలకే పరిమితమని కాగ్‌ నివేదిక తేటతెల్లం చేసిందని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు దాటి మరీ అప్పులు చేస్తున్నారని, జీఎ్‌సడీపీలో అప్పుల శాతం 34.29 శాతానికి చేరిందని తెలిపారు.

Updated Date - Mar 31 , 2026 | 06:07 AM