కల్యాణలక్ష్మి పక్కదారి
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:32 AM
కల్యాణలక్ష్మి పథకంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చి చెప్పింది. సబ్సిడీ ధర మీద పంపిణీ చేస్తున్న బియ్యం కూడా పక్కదారి పడుతోందని...
అర్హత లేని వారికి రూ.55.12 కోట్ల పంపిణీ
83,545 మంది అనర్హులకు రూ.135.16 కోట్ల రేషన్ బియ్యం పంపిణీ
నిమ్జ్‌లో ఓ సంస్థకు 49 ఎకరాలకు బదులు 511 ఎకరాలు
మలక్‌పేట ఆస్పత్రిలో కొత్త వెంటిలేటర్లు 2 ఏళ్లపాటు మూలన
ప్రైవేటులో 61 శాతానికి పెరిగిన సిజేరియన్లు: కాగ్
నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
రాష్ట్ర వ్యయం 80 శాతమే.. 2024-25లో బడ్జెట్ లక్ష్యాల మేరకు ప్రభుత్వం ఖర్చు చేయలేదన్న కాగ్
కల్యాణలక్ష్మి పథకంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చి చెప్పింది. సబ్సిడీ ధర మీద పంపిణీ చేస్తున్న బియ్యం కూడా పక్కదారి పడుతోందని, వేలాది మంది అనర్హులకు బియ్యం చేరుతోందని తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వరంగ వైద్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు సగం పోస్టులు ఖాళీలు ఉన్నాయని, ఔషధాల సరఫరా సరిగా లేదని, ఉన్న యంత్రాలను కూడా వాడకుండా మూలన పడేస్తున్న దారుణమైన నిర్లక్ష్యం నెలకొందని ఆక్షేపించింది. ఇక, పరిశ్రమలకు భూములు కేటాయించి ఉపాధి అవకాశాలు లభించేలా చూడాల్సిన టీజీఐఐసీ లీలలు అన్నీ ఇన్నీ కావని వెల్లడించింది. కాగ్ నివేదికను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.