గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పరిశీలనకు క్యాబినెట్ సబ్‌కమిటీ
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:42 AM
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పర్యవేక్షణకు క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, మార్చి 4 : గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పర్యవేక్షణకు క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చైర్మన్‌గా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సభ్యులుగా.. ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.