Share News

ఇక రాష్ట్రంలో సమర్థ పోలీసింగ్‌

ABN , Publish Date - May 16 , 2026 | 04:34 AM

ఇకపై తెలంగాణలో సమర్థవంతమైన పోలీసింగ్‌ స్పష్టంగా కన్పించనుందని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. శుక్రవారం నగరంలో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..

ఇక రాష్ట్రంలో సమర్థ పోలీసింగ్‌

  • పోలీసుల ఆరోగ్యంపై పర్యవేక్షణకు యాప్‌

  • చర్చా కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): ఇకపై తెలంగాణలో సమర్థవంతమైన పోలీసింగ్‌ స్పష్టంగా కన్పించనుందని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. శుక్రవారం నగరంలో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ పోలీసులతో పాటు శాంతిభద్రతల విభాగం సిబ్బంది, అఽధికారులు సైతం రద్దీ సమయాల్లో రోడ్లమీద తప్పనిసరిగా కన్పించేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75 వేల మంది పోలీసులకు సంబంధించి ప్రత్యేక యాప్‌ ద్వారా ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించే వ్యవస్ధను ప్రారంభించనున్నామని చెప్పారు. తాను అండర్‌-19 క్రికెట్‌ ఆడే సమయం నుంచి నేటి వరకు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నానని, వారానికి మూడు రోజులు వెయిట్‌ ట్రైనింగ్‌, క్రికెట్‌, టెన్నీస్‌, గోల్ఫ్‌ ఆడుతుంటానన్నారు. ఆహారంలో అన్నం, పంచదార, ఉప్పు, మైదాను ఎప్పుడో దూరం చేశానని తెలిపారు. గత రెండు మూడేళ్లుగా పోలీసు సిబ్బందిలో ఆత్మస్థైర్యం తగ్గినట్లు అనిపిస్తోందని, సమర్థవంతమైన పోలీసింగ్‌ అమలు ద్వారా పోలీసుల మనోధైర్యాన్ని పెంపొందించవచ్చన్నారు.

Updated Date - May 16 , 2026 | 04:36 AM