kumaram bheem asifabad-అవగాహన కల్పించి.. ప్రతిజ్ఞ చేయించి..
ABN , Publish Date - Apr 15 , 2026 | 10:31 PM
జిల్లాలోని పలు మండలాల్లో అలైవ్- అరైవ్ రోడ్డు సేఫ్టీలో భాగంగా బుధవారం అధికారులు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కేంద్రంలోని మహాత్మజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
ఆసిఫాబాద్‌రూరల్/బెజ్జూరు/చింతలమానేపల్లి/కాగజ్‌నగర్ టౌన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో అలైవ్- అరైవ్ రోడ్డు సేఫ్టీలో భాగంగా బుధవారం అధికారులు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కేంద్రంలోని మహాత్మజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రత పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సై కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. బెజ్జూరు మండలంలోని కోర్తెగూడ గ్రామంలో రహదారి భద్రతపై గ్రామస్తులకు తహసీల్దార్ రామ్మోహన్‌రావు అవగాహన కల్పించారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు చోటు చేసుకోవాలని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్టు ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రతి ఒక్కరు వాహన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని కోరారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏఎస్సై మోహన్‌నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలో గాయత్రి పాఠశాలలో ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు డీఎస్పీ వహిదుద్దీన్ సూచనలతో సీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రోడ్డు దాటే విధానం, హెల్మెట్ వినియోగం, సీటు బెల్టు ఉపయోగం, పాఠశాల బస్సుల్లో సురక్షితంగా ఎక్కడం, పాఠశాలల వద్ద వేగ నియంత్రణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, స్కూల్ పిల్లలను అధిక సంఖ్యలో వాహనాల్లో తీసుకెళ్లడం, పాఠశాలల వద్ద అతి వేగం వంటి నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలిని కాగజ్‌నగర్ డిఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. కేజీబీఈ పాఠశాలలో విద్యార్థినులకు హెల్మెట్ ధరించడం, రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సైలు సుధాకర్, రాజు, లక్ష్మణ్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా కాగజ్‌నగర్‌లో పోలీసులు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించడంపై అవగాహన కోసం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.