Share News

షరతులు లేకుండా మొక్కజొన్న కొనాలి

ABN , Publish Date - May 15 , 2026 | 11:01 PM

ఏలాంటి షరతులు లేకుండా రైతులు పండించిన మక్కజొన్నను కొనుగోలు చేయాలని మంచిర్యాల మాజీ ఎ మ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు డిమాండ్‌ చేసారు. శుక్రవారం హాజీపూర్‌ మండలంలోని సబ్బపెల్లి, గుడిపేట గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన నాయకులతో కలిసి సందర్శిం చారు.

షరతులు లేకుండా మొక్కజొన్న కొనాలి

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు

హాజీపూర్‌, మే 15(ఆంధ్రజ్యోతి): ఏలాంటి షరతులు లేకుండా రైతులు పండించిన మక్కజొన్నను కొనుగోలు చేయాలని మంచిర్యాల మాజీ ఎ మ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు డిమాండ్‌ చేసారు. శుక్రవారం హాజీపూర్‌ మండలంలోని సబ్బపెల్లి, గుడిపేట గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన నాయకులతో కలిసి సందర్శిం చారు. రైతులతో మాట్లాడి కేంద్రాల్లో వసతులపై ఆరా తీసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రబుత్వం రైతులు పండించిన మొక్క జొన్న దాన్యం ఎకరాకు 26క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని అలా కాకుండా ఎకరాకు 40క్వింటాల్లు కొనుగోలు చేయాలన్నారు. రైతుల నుంచిసేకరించిన మొక్కజొన్న తరలింపునకు రైతుల నుంచి డబ్బులు వ సూలు చేస్తున్నారని అలా ఒక్క పైసా వసూలు చేసినా ఊరుకోమన్నారు. గత ప్రభుత్వంలో ఏనాడు ఒక్క పైసా కూడా రైతుల నుంచితీసుకున్న పాపాన పోలేదని కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రైతులను చాలా ఇ బ్బంది పెడుతున్నారని అన్నారు. కేంద్రం నిర్వహకులతో ఎమ్మెల్యే కుమ్మ క్కై రైతుల నడ్డి విరుస్తున్నారని ఈ విషయంపై అధికారులు విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులు ఉన్నారు.

Updated Date - May 15 , 2026 | 11:01 PM