Share News

మేడారం జాతరకు బస్సులు ప్రారంభం

ABN , Publish Date - Jan 27 , 2026 | 12:02 AM

సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వెళ్లే భక్తుల కోసం సోమవారం కొత్త బస్టాండ్‌ ఆవరణలో బస్సు సర్వీ సులను ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌లు ప్రారంభించారు.

మేడారం జాతరకు బస్సులు ప్రారంభం

బెల్లంపల్లి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వెళ్లే భక్తుల కోసం సోమవారం కొత్త బస్టాండ్‌ ఆవరణలో బస్సు సర్వీ సులను ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌లు ప్రారంభించారు. మే డారం సమ్మక్కసారలమ్మజాతరకు వెళ్లే భక్తులు బస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులో టికెట్‌ కొ నుగోలు చేసి ఎమ్మెల్యే వినోద్‌, నాయకులు ప్రయాణించారు.

తాండూర్‌ : మండలంలోని కర్షలగట్టం వద్ద నిర్వహించే సమ్మక్క సా రలమ్మ జాతర కోసం సర్పంచు ముడిమడుగుల సురేష్‌, పంచాయతీ కా ర్యదర్శి దివాకర్‌ల ఆధ్వర్యంలో జాతర కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా సర్పంచు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర కోసం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మండలంలోని భక్తులు అధిక సంఖ్య లో జాతరకు హాజరై వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకో వాలన్నారు. జాతర విజయవంతంగా జరగడం కోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిరంగి శంకర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఈసా, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

వేమనపల్లి : బుయ్యారం గ్రామ సర్పంచు కొండి మానస శ్రీకాంత్‌ ఎ న్నికల సమయంలో సర్పంచుగా గెలిస్తే తమ అభిమాన నాయకుడు మాజీ జడ్పీటీసీ రుధ్రభట్ల సంతోష్‌కుమార్‌ నిలువెత్తు బెల్లం తులాభారం చేస్తామ ని మొక్కుకోగా సర్పంచుగా గెలవడంతో సోమవారం నీల్వాయిలో బెల్లం తులాభారం వేసి మొక్కును తీర్చారు. దీంతో సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ తనపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 12:02 AM