kumaram bheem asifabadబస్‌షెల్టర్లు కరువు
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:03 PM
పలు మండలాల్లో బస్‌షెల్లర్టు లేక ప్రయాణికులు కూర్చోలేక, నిల్చోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సులకోసం చెట్ల నీడలో, హోటళ్ల ఎదుట, రోడ్డు పై వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రయాణికు ల సౌకర్యార్థం తాగునీరు, మూత్రశాలలు ఎక్కడా కనిపిం చడం లేదు. దీంతో విద్యార్థినులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం కనీసం చేతి పంపులు సైతం ఎక్కడా లేవు.
- ఎండా, వాన నుంచి రక్షణ కరువు
- పట్టించుకోని అధికారులు
కెరమెరి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): పలు మండలాల్లో బస్‌షెల్లర్టు లేక ప్రయాణికులు కూర్చోలేక, నిల్చోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. బస్సులకోసం చెట్ల నీడలో, హోటళ్ల ఎదుట, రోడ్డు పై వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రయాణికు ల సౌకర్యార్థం తాగునీరు, మూత్రశాలలు ఎక్కడా కనిపిం చడం లేదు. దీంతో విద్యార్థినులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం కనీసం చేతి పంపులు సైతం ఎక్కడా లేవు. నిత్యం వివిధ పనులపై ప్రజలు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. దీని కోసం బస్టాండుకుని చెరుకుని బస్సులు వచ్చే వరకు వేచి చూస్తారు. ఏదైనా కారణంతో బస్సులు ఆలస్యం అయినా వేచి ఉండేందుకు బస్టాండ్‌లు ఉండాలి. పలు గ్రామాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్లు లేక ప్రయాణికులు చెట్ల నీడలోనే బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని పలు గ్రామాల్లో ప్రయాణికులు ఎండకాలం, వర్షాకాలంలో ఎండలో, వాహనలో తమకు తాము రక్షించుకనేందుకు సమీపంలోని చెట్లను ఆశ్రయిస్తున్నారు. వేసవి కాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీటి కోసం కనీసం బోరు సైతం లేక తాగునీటికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చిన్న పిల్లలు, వృద్దులు, మహిళలు నీటికి ఇబ్బందులు పడాల్సి న పరిస్థితి నెలకొన్నది. మండలంలోని కొత్తగూడెం, కోటారి, సావర్‌ఖేడ ఎక్స్ రెడ్డు, మోడి, మెట్ట పిప్పిరి, హట్టి ఎక్స్ రోడ్డు, సాంగ్వీ ఎక్స్ రోడ్, అనార్‌పల్లి ఎక్స్ రోడ్ తదితర గ్రామాల్లో బస్సు షెలర్టులు నిర్మించాలని ఆయా గ్రామాల ప్రయాణికులు కోరుతున్నారు. ఆయా గ్రామాల నుంచి ప్రతి నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు, మహిళలు, విద్యార్థుల మండల కేంద్రం అయిన కెరమరికి, జిల్లా కేంద్రం అయిన ఆసిఫాబాద్‌కు, అలాగే ఉట్నూర్, ఆదిలాబాద్ లాంటి పట్టణాలకు రాక పోకలు సాగిస్తుంటారు. ఆయా గ్రామాల అవసరాల రిత్యా వెంటనే ఆర్టీసీ అధికారులు లేక ఇతర శాఖల అధికారులు స్పందిం చి ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్‌లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
అధికారులకు ప్రతిపాదనలు అందజేస్తాం..
- మడావి శాంతాబాయి, సర్పంచ్, కోటారి
ఆర్టీసీ అధికారులకు గ్రామసభలో తీర్మానం చేసి కొత్తీగూడ ఎక్స్ రోడ్‌లో బస్ షెల్టర్ నిర్మించాలని ప్రతిపాదనలు పంపిస్తాం. ఇక్కడ షెల్టర్ లేక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే బస్ షెల్టర్ నిర్మించాలి.