kumaram bheem asifabad- మండుతున్న ఎండలు
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:08 PM
ఎండలు మండుతున్నాయి. ప్రజలు వేడి తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే ఎండ ప్రభావం చూపుతోందిు. 11 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలే జంకుతున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండుతున్నాయి. ప్రజలు వేడి తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు మించి నమోదవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే ఎండ ప్రభావం చూపుతోందిు. 11 నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటేనే ప్రజలే జంకుతున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. కెరమెరి మండలంలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్టోగ్రత నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌లో 43.8, సిర్పూర్(టి)లో 43.7, దహెగాంలో 43.5, రెబ్బెనలో 43.3, కాగజ్‌నగర్, తిర్యాణి, వాంకిడి మండలాల్లో 43.1, జైనూర్‌లో 42.8, పెంచికలపేటలో 42.7, కౌటాలలో 42.4 బెజ్జూరు లో42.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి తాపానికి తోడు గాలిలో తేమ శాతం తగ్గుతుండడంతో వేడిగాలులు, తీవ్రమైన ఉక్కపోతలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు బయటకు వచ్చే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండలు మండుతుండడంతో భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే పనులు చేస్తున్నారు. వేడి నుంచి బయట పడేందుకు ప్రజలు శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఉక్కపోతకు తట్టుకోలేక ప్రజలు కూలర్లు, ఏసీలు పెట్టుకుని ఉపశమనం పొందుతున్నారు.
జాగ్రత్తలు ఇలా..
వేసవిలో లేత రంగులో ఉండే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది.. నల్లని, ముదురు రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు తేలికపాటి ఆహారం మితంగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఉష్ణోగ్రత్తల నుంచి రక్షించుకోవాలటే బయటకు వెళ్లేటప్పుడు తలపై క్యాప్, తెల్లని వస్త్రాన్ని ధరించాలి. ఎండ వేడికి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాఫీ, టీ ఎక్కువగా తాగకూడదు. అల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. వాటికి బదులు నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కీర దోసకాయ, పండ్లు అధికంగా తీసుకోవాలి. చల్లటి వాతావ రణంలో ఎక్కువ సేపు గడిపేందుకు ప్రయత్నించాలి. ఉష్ణోగ్రతలు తగ్గే వరకు చిన్న పిల్లలు, వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి.
- వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బకు గురైనప్పుడు సరైన చికిత్స, చర్యలు తీసుకొకపోతే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వడదెబ్బ తగిలిన వ్యక్తికి అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం, శ్వాస తీసుకొవాడంలో ఇబ్బంది, మూర్చ, వికారం, చర్మం ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే ఆ వ్యక్తికి గాలి తగిలేలా చర్యలు తీసుకోవాలి. ఓఆర్‌ఎస్ ఇవ్వాలి. ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.