Share News

kumaram bheem asifabad- కస్తూర్బా విద్యాలయాలకు బంకర్‌ బెడ్లు

ABN , Publish Date - Sep 23 , 2026 | 11:10 PM

కస్తూర్బా విద్యాలయాలకు బంకర్‌ బెడ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కస్తూర్బాలో చదువుకుం టున్న అత్యధికుల్లో నిరుపేద కుటుంబాలకు చెందినవారు, తల్లిదండ్రులు కోల్పోయిన వారే ఉంటా రు. ఈ విద్యాలయాల్లో చదువుకుంటున్న బాలికలు ఏళ్లుగా నేలపైనే నిద్రిస్తున్నారు. గురుకులాల్లో మాత్రం పడకలు అందుబాటులో ఉండడం, ఇక్కడ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

kumaram bheem asifabad- కస్తూర్బా విద్యాలయాలకు బంకర్‌ బెడ్లు
ప్రభుత్వం పంపిణీ చేసిన బంకర్‌ బెడ్లు

బెజ్జూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బా విద్యాలయాలకు బంకర్‌ బెడ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కస్తూర్బాలో చదువుకుం టున్న అత్యధికుల్లో నిరుపేద కుటుంబాలకు చెందినవారు, తల్లిదండ్రులు కోల్పోయిన వారే ఉంటా రు. ఈ విద్యాలయాల్లో చదువుకుంటున్న బాలికలు ఏళ్లుగా నేలపైనే నిద్రిస్తున్నారు. గురుకులాల్లో మాత్రం పడకలు అందుబాటులో ఉండడం, ఇక్కడ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీని నుంచి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు బంకర్‌ మంచాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇక హాయిగా నిద్రపోయే అవకాశం ఏర్పడుతుంది. ఇన్నా ళ్లు నేలపైన పడుకోవడం మూలంగా విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు.

- జిల్లా వ్యాప్తంగా..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 15కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 13చోట్ల 6నుంచి ఇంటర్‌ తరగతులు కొనసాగుతున్నాయి. మిగితా వాటిలో 10వ తరగతి వరకు బోధన సాగుతోంది. జిల్లాలో సుమారు 4వేలకుపైగా మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని విద్యాలయాలకు బంకర్‌ బెడ్లు అందించాలని నిర్ణ యించింది. ఒక్కో పాఠశాలకు 200చొప్పున అంది స్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్నిచోట్ల చేరగా, త్వరలోనే అన్ని పాఠశాలలకు రానున్నాయి. ఇద్దరికి ఒకటి చొప్పున బంకర్‌ బెడ్లు అందిస్తున్నారు. విద్యారినుల సంఖ్యకు అనుగుణంగా సరఫరా చేశారు. వాటిని బిగించేందుకు సిబ్బందిని సైతం కేటాయించారు. ఇప్పటికే బెడ్‌షీట్లు పంపిణీ చేయగా, ప్రస్తుతం దిండ్లు సైతం ఇస్తున్నారు. బంకర్‌ బెడ్ల సరఫరాతో విద్యార్థినులకు ఇక ఇబ్బందులు తొలగను న్నాయి. కాగా కస్తూర్బా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం బంకర్‌ బెడ్లను పంపిణీ చేస్తుండగా, అసలు సమస్య ఇప్పుడే మొదలు కానుంది. జిల్లాలోని పాఠశాలల్లో పూర్తిస్థా యిలో సౌకర్యాలు లేక విద్యార్థినులు అవస్థలు పడు తుండగా, జిల్లాలో పలుచోట్ల గదులు లేక బంకర్‌ బెడ్లు ఏర్పాటు చేసేందుకు గదుల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో వాటిని పాఠశాలల్లో ఎలా ఏర్పాటు చేయాలో తెలియక అవస్థలు పడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. బంకర్‌ బెడ్లు పంపిణీ చేయడం బాగా నే ఉన్నా గదుల కొరతతో ఇబ్బందులు తప్పేలా లేవు.

Updated Date - Sep 23 , 2026 | 11:10 PM