kumaram bheem asifabad- మహిళా సమాఖ్యలకు భవనాలు
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:00 PM
ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) పరిధిలోని మండల, గ్రామ సమాఖ్యలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న భవనాల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సొంత భవనాలు లేక అద్దె గదుల్లో, ఇరుకు ప్రాంగ ణాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మహిళా సంఘాల కు ఇకపై సమాఖ్య భవనాలు అండగా నిలువను న్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది
- ప్రభుత్వం ఉత్తర్వులు
రెబ్బెన, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) పరిధిలోని మండల, గ్రామ సమాఖ్యలు ఏళ్లుగా ఎదుర్కొంటున్న భవనాల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సొంత భవనాలు లేక అద్దె గదుల్లో, ఇరుకు ప్రాంగ ణాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మహిళా సంఘాల కు ఇకపై సమాఖ్య భవనాలు అండగా నిలువను న్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 11 మండలాలకు మాత్రమే మండల సమాఖ్య సంఘాలకు పక్కా భవనాలు ఉన్నాయి. రెబ్బెన, లింగాపూర్, చింతలమానేపల్లి, పెంచికలపేట మండలాల్లో లేవు. గ్రామ సమాఖ్య సంఘాలకు సొంత భవనాలు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో రూ.5 కోట్లతో జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రెబ్బెన మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) గౌతమి మండల సమాఖ్య కార్యాలయం రేకుల షెడ్డులోనే అరకొర వసతుల మధ్య కొనసాగుతోంది. మండలం లోని 24 గ్రామ పంచాయతీల్లో 26 గ్రామ పంచాయ తీల్లో 26 గ్రామ సంఘాల్లో 667 స్వయం సహాయక సంఘాలు, 7,235 మంది మహిళా సభ్యులు ఉన్నారు. ఇక్కడ కనీసం 20 మంది సభ్యులు కూర్చోలేని పరిస్థితి. నీటి వసతి లేక మహి ళలు అవస్థలు పడుతున్నారు. గతంలో రూ.33 లక్షల తో స్త్రీ శక్తి భవనం మంజూరైంది. పనులు సకాలంలో ప్రారంభం కాక నిధులు వెనక్కి వెళ్లి పోయాయి. అప్పటి నుంచి రేకుల షెడ్డు కిందనే సమావేశాలు, శిక్ష కార్యక లాపాలు కొనసాగుతున్నాయి.
- వసతులు లేక అవస్థలు..
ప్రస్తుతం ఐకేపీ మహిళా సంఘాల ప్రతినిధులు సమావేశాలు, శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాల న్నా సరైన వేదిక లేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా నిర్మించే భవనాలు కార్యాలయాలుగానే కాకుండా బహుళార్థ సాధక కేంద్రాలుగా ఉపయోగిం చనున్నారు. సంఘాల సభ్యులకు నైపుణ్యాభివృద్ధిలో భాగంగా శిక్షణ ఇచ్చే వీలుంటుంది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయిం చనున్నారు. నిర్మాణానికి పంచాయతీ పరిధిలో కనీసం నాలుగు గుంటల స్థలం ఉండాలని ప్రభు త్వం నిబంధన విధించింది. స్థలాలు గుర్తింపు పూర్త యిన తరువాత మహిళా సమాఖ్యలు భవన నిర్మా ణం కోసం తీర్మానం చేసి గ్రామ పంచాయతీకి సమ ర్పిస్తారు. అనంతరం ఉన్నతాధికారుల అనుమతితో పనులు ప్రారంభిస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
మండల సమాఖ్య సంఘాలు : 15
స్వయం సహాయక సంఘాలు : 8,158
భవనాలు ఉన్నవి : 11
భవనాలు లేనివి : 04
గ్రామ సమైక్య సంఘాలు : 386
భవనాలు కావాల్సినవి : 386
మొత్తం సభ్యులు : 93,477