జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యం
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:49 PM
స్వేరోస్ నెట్‌వర్క్ జిల్లా కార్యవర్గం ఏ ర్పడింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రాం భవన్‌లో నిర్వహించిన సమావేశం లో స్వేరోస్ జిల్లా ఇన్‌చార్జి బోడ వెంకటేష్ ఆధ్వ ర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు.
- స్వేరోస్ నెట్‌వర్క్ జిల్లా కమిటీ ఎన్నికలో నాయకులు
నాగర్‌కర్నూల్‌టౌన్, సెప్టెంబరు27 (ఆంధ్రజ్యో తి) : స్వేరోస్ నెట్‌వర్క్ జిల్లా కార్యవర్గం ఏ ర్పడింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రాం భవన్‌లో నిర్వహించిన సమావేశం లో స్వేరోస్ జిల్లా ఇన్‌చార్జి బోడ వెంకటేష్ ఆధ్వ ర్యంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బండమీది కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా అల్లిపోగుల చింటూ, ఉపా ధ్యక్షులుగా బి.పరమేశ్వర్, మబ్బు రాము, కోశా ధికారిగా జి.కృష్ణ, అధి కార ప్రతినిధిగా అన్నాజీ, జాయింట్ సెక్రెటరీలుగా డి.సురేష్, వినయ్, కార్య నిర్వాహక కార్యదర్శిగా ఎ. విష్ణులను నియమించారు. కార్యవర్గ సభ్యులుగా ఎం. పర్వతాలు, బి.శంకర్, రా కేష్‌లను ఎన్నుకున్నారు. స్వే రోస్ జిల్లా ఇన్‌చార్జి బోడ వెంకటేష్ మాట్లా డుతూ ‘‘అక్షరం-ఆరోగ్యం- ఆర్థికం- ఆత్మగౌరవం’’ అనే లక్ష్యాలతో జ్ఞాన సమాజ నిర్మాణానికి నూత న కమిటీ కృషి చేయాలని కోరారు. స్వేరోస్ నెట్‌వర్క్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీ ణ్‌కుమార్ స్ఫూర్తితో మహాత్మా ఫూలే, అంబే డ్కర్, సావిత్రిబాయి ఫూలే, కాన్షీరాం ఆశయాల సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపుని చ్చారు. కార్యక్రమంలో స్వేరోస్ నెట్‌వర్క్ జిల్లా కోకన్వీనర్ గిద్ద విజయ్‌కుమార్, సీనియన్ స్వేరో దుబ్బ నాగేష్, రాకేశ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.