ఆర్థిక కష్టాల్లో ఉన్నాం.. బిల్లులు చెల్లించండి
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:15 AM
ఐదేళ్లగా (2021 నుంచి) కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బిల్డర్స్ ...
సీఎం రేవంత్‌కు బిల్డర్స్ అసోసియేషన్ లేఖ
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లగా (2021 నుంచి) కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) కోరింది. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కాంట్రాక్టర్లు అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇటీవల ఓ కాంట్రాక్టర్ ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ ఆర్థిక సంక్షోభ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బకాయిలను తక్షణమే చెల్లించాలని బీఏఐ జాతీయ ఉపాధ్యక్షుడు డి.వి.ఎన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.