జీవో 97 రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌వీ ఆందోళన...
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:18 PM
పాలిటెక్నిక్ కళాశాలను శక్తి విభా గం యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పరిధిలోకి తీసుకోస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నస్పూర్‌లోని సీసీసీ కార్నర్ వద్ద బీఆర్‌ఎస్‌వీ ఆద్వర్యంలో రాస్తారోకో చేశా రు.
విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దు- మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
నస్పూర్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : పాలిటెక్నిక్ కళాశాలను శక్తి విభా గం యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పరిధిలోకి తీసుకోస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నస్పూర్‌లోని సీసీసీ కార్నర్ వద్ద బీఆర్‌ఎస్‌వీ ఆద్వర్యంలో రాస్తారోకో చేశా రు. రాస్తారోకో సందర్భంగా వాహనాల రాకపోకలకు కొద్ది సేపు అంత రాయం కలిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా నిలిచి బీఆర్‌ఎస్‌వీ ఆందోళనకు చేపట్టగా మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు సంఘీబావం తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ ప దవ తరగతి పూర్తయ్యాక పాలిటెక్నిక్ కోర్సులు చేసిన విద్యార్థులకు వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న కోర్సులను రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. బీజేపీ జాతీయ విద్యా విధానానికి అనుకూలంగా జీవో నం. 97 తీసుకువచ్చిందన్నారు. ఫీజుల రియంబర్స్ మెంట్ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం శక్తి పథకాన్ని అ నుసంధానం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో బీ ఆర్‌ఎస్‌వీ, బీఆర్‌ఎస్ దగ్గుల మధు, నాయకులు నరేష్, రాజు, ప్రశాంత్, అక్కూరి సుబ్బయ్య, మెరుగు పవన్ కుమార్, హైమద్ పాల్గొన్నారు.