బీజేపీలో విలీనం కానున్న బీఆర్‌ఎస్
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:21 AM
బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే బీజేపీలో విలీనం కానుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అందుకే బీఆర్‌ఎస్ నేతలు డ్రగ్స్ పార్టీల్లో దొరుకుతున్నా...
అందుకే డ్రగ్స్ కేసులపై ఆ పార్టీ స్పందించట్లేదు
మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే బీజేపీలో విలీనం కానుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అందుకే బీఆర్‌ఎస్ నేతలు డ్రగ్స్ పార్టీల్లో దొరుకుతున్నా బీజేపీ స్పందించట్లేదన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఈగల్ టీమ్ దాడిలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయాడని, కేటీఆర్ ఫామ్ హౌస్‌లో ఆయన బావమరిది డ్రగ్స్‌తో పట్టుబడ్డాడని, అలాగే కేటీఆర్ సన్నిహితుడు కేదార్‌నాథ్ డ్రగ్స్ మోతాదు ఎక్కువై దుబాయిలో చనిపోయాడని ఆరోపించారు. వీటిపై బీజేపీ నేతలు స్పందించక పోగా, ఆ పార్టీ ఎంపీ రఘునందన్ మాట్లాడితే నోరు మూయించారని తెలిపారు. బీసీ నాయకుడు బండారు దత్తాత్రేయ బీజేపీకి ఎన్నో సేవలు చేసినా, ఆయన సికింద్రాబాద్ సీటును కిషన్‌రెడ్డి లాక్కున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.