సింగరేణిని సంక్షోభంలోకి నెట్టింది బీఆర్‌ఎస్‌యే
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:46 PM
తెలంగాణకే తలమానికమైన సింగరేణి సంస్థను పదేళ్ల బీఆర్‌ఎస్‌పాలనలో విచ్చల విడిగా నిధులు దారి మళ్లించారని, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులను సిరిసిల్ల, గజ్వేల్,సిద్దిపేటకు మళ్లించారని రాష్ట్రకార్మిక,ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆరోపించారు.
-రాష్ట్ర కార్మిక , గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
మందమర్రిటౌన్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణకే తలమానికమైన సింగరేణి సంస్థను పదేళ్ల బీఆర్‌ఎస్‌పాలనలో విచ్చల విడిగా నిధులు దారి మళ్లించారని, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులను సిరిసిల్ల, గజ్వేల్,సిద్దిపేటకు మళ్లించారని రాష్ట్రకార్మిక,ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి ఆరోపించారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావు, కూతురు కవిత సినిమా మొదలైందని ఎద్దేవ చేశారు. శుక్రవారం రామకృష్ణపూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొదటి నుంచి తాను బీఆర్‌ఎస్‌పదేళ్ల అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారన్నారు. ఆ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కేసీఆర్ కుటుంబ అవినీతి గురించి వెనకడుగు వేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వృధా ప్రాజెక్టు అని కేసీఆర్ , ఆయన అల్లుడు హరీష్‌రావు పెద్ద ఎత్తున కుంభకోణాలు చేశారని తెలిపారు. కేసీఆర్ సొంత ఆలోచనతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్లతో కుప్పకూలే పరిస్థితి నెలకొందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు వద్ద నిర్మిస్తే భూములన్నీ సస్యశ్యామలం అయ్యేవన్నారు. ఈ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో చెన్నూరులో రైతులు నష్టపోయారని తెలిపారు. సింగరేణిని కాపాడింది తన తండ్రి కాకా వెంకటస్వామి అని తెలిపారు. త్వరలో క్యాతనపల్లి మున్సిపాలిటీలోని ఆర్కే ఓసీపీ ప్రాజెక్టు రెండవ దశ విస్తరణ పనులు మొదలు కానున్నాయని, ఇందులో 5 వేల ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామన్నారు.తనతండ్రి హయాంలో పునాది వేసిన జైపూర్ పవర్‌ప్లాంట్‌లో మళ్లీ 1200 మెగవాట్ల పనులుప్రారంభం కానున్నాయని, ఇందులో కూడా స్తానికులకు ఉద్యోగాలు ఇవ్వానున్నారు. సిద్దిపేట,గజ్వేల్,మెదక్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధించిందన్నారు.దీంతో మాజీ మంత్రి హరీష్‌రావు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని, ప్రజలు ఆయననునిలదీయాలని, ముందు కవిత ఆరోపణలకు జవాబులు చెప్పి మాట్లాడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి, పట్టణాధ్యక్ష్‌ఉడు పల్లె రాజు, 20వ వార్డు అభ్యర్ధి కూతురు ప్రభాకర్,నాయకులు గాండ్ల సమ్మయ్య తదితరులుపాల్గొన్నారు.