బీఆర్‌ఎస్, బీజేపీ కొట్లాట హాస్యాస్పదం: అద్దంకి
ABN , Publish Date - May 08 , 2026 | 06:31 AM
కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నేతల మధ్య కొట్లాట హాస్యాస్పదంగా ఉందని మండలిలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి) : కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నేతల మధ్య కొట్లాట హాస్యాస్పదంగా ఉందని మండలిలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. రెండు పార్టీల అధినాయకత్వాలు కలిసే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఈ కొట్లాటలతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదని, ఇలాంటి దాడులను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. కాగా.. కౌశిక్‌రెడ్డి మాట్లాడే మాటలకు ఎవరో ఒకరు తంతారని అనుకున్నానని, ఇప్పుడు అదే జరిగిందని ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయన్నదానికి కరీంనగర్ ఘటన నిదర్శనమని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, పేర్కొన్నారు. కాగా.. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు బొమ్మ, బొరుసు వంటివని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ పేర్కొన్నారు. బండి సంజయ్, కౌశిక్‌రెడ్డిల భాష, వ్యవహార శైలి ఒక్కటేనన్నారు.