Share News

నీచ రాజకీయాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌: అద్దంకి

ABN , Publish Date - Jun 22 , 2026 | 04:24 AM

బీఆర్‌ఎస్‌ లాంటి ప్రతిపక్షం ఉంటే.. రాష్ట్రం ముందుకు పోదని మండలిలో ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ పేర్కొన్నారు. రాయదుర్గం భూములను ప్రభుత్వం వేలం ...

నీచ రాజకీయాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌: అద్దంకి

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్‌ లాంటి ప్రతిపక్షం ఉంటే.. రాష్ట్రం ముందుకు పోదని మండలిలో ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ పేర్కొన్నారు. రాయదుర్గం భూములను ప్రభుత్వం వేలం వేసిన తర్వాత ఎస్‌బీఐని కోర్టుకు పంపి పంచాయతీ పెట్టిన నీచులు ఆ పార్టీ నేతలని విమర్శించారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో పదేళ్ల పాటు ఎస్‌బీఐ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టలేదని గుర్తుచేశారు. ఆ బ్యాంకు అధికారులను కూడా బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం లొంగదీసుకున్నట్లుగా కనిపిస్తోందన్నారు. నీచాతి నీచమైన రాజకీయం చేస్తున్న ప్రతిపక్షం.. అఘోరాలా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. మూసీ అభివృద్ధిపై కేటీఆర్‌ తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 04:24 AM