Share News

రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ షోకాజ్‌ నోటీస్‌

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:41 AM

మాదకద్రవ్యాల కేసులో అరెస్టై.. రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఫాంహౌస్‌ పార్టీలో రోహిత్‌రెడ్డి పాల్గొన్నట్లు వచ్చిన ...

రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ షోకాజ్‌ నోటీస్‌

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల కేసులో అరెస్టై.. రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఫాంహౌస్‌ పార్టీలో రోహిత్‌రెడ్డి పాల్గొన్నట్లు వచ్చిన ఆరోపణలు పార్టీ అధినాయకత్వం దృష్టికి వచ్చినట్లు ఆ నోటీ స్‌లో పేర్కొన్నారు. ఈ విషయం మీడియాలో ప్రచారం కావడంతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి ఏర్పడినందున కేసీఆర్‌ ఆదేశాల మేరకు నోటీసు జారీ చేసిట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌ తెలిపారు. నోటీసు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోపు సదరు ఆరోపణలపై స్పష్టమైన, సమగ్ర లిఖితపూర్వక వివరణ సమర్పించాలని రోహిత్‌రెడ్డిని ఆదేశించారు. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకుంటే.. పార్టీ నియమావళి ప్రకారం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశంపై తుదినిర్ణయం తీసుకునే వరకు, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని సూచించారు.

Updated Date - Mar 18 , 2026 | 04:41 AM