kumaram bheem asifabad-నేటీ నుంచి బీఆర్‌ఎస్ ఆందోళనలు
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:10 PM
కాంగ్రెస్ ప్రభుత్వ వేయి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట పట్ట నుంది. బుధవారం నుంచి 8 వరకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వివిధ దశల్లో ఆందోళనలు నిర్వహించి ప్రజలను కలవాలని కార్యాచరణ రుపొందించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు కానివి ఏమిటి ఆ ఇంటికి ప్రభుత్వం హామీ ఇచ్చి బకాయి పడింది ఎం త అనే వివరాలు నమోదు చేసిన బకాయి కార్డులను పంపిణీ చేయాలని బీఆర్‌ఎస్ ఆదిష్ఠానం నిర్ణయిం చింది.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వ వేయి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట పట్ట నుంది. బుధవారం నుంచి 8 వరకు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వివిధ దశల్లో ఆందోళనలు నిర్వహించి ప్రజలను కలవాలని కార్యాచరణ రుపొందించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, అమలు కానివి ఏమిటి ఆ ఇంటికి ప్రభుత్వం హామీ ఇచ్చి బకాయి పడింది ఎం త అనే వివరాలు నమోదు చేసిన బకాయి కార్డులను పంపిణీ చేయాలని బీఆర్‌ఎస్ ఆదిష్ఠానం నిర్ణయిం చింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కేసీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలు, అనాటి పరిస్థి తులకు ఇప్పటికి ఉన్న వ్యత్యాసాలను ప్రజల ముందు ఉంచి వారి మద్దతును కూడగట్టుకో వాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు ఆందోళనకు నాయకత్వం వహించనున్నారు. మంగళవా రం బీఆర్‌ఎస్ ఆదిష్ఠానం తెలంగాణ భవ న్‌లో కాంగ్రెస్ పాలనపై చార్జీషీట్ విడుదల చేసింది. సెప్టెంబరు 2 నుంచి జిల్లాలో ఈ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 2న గ్యారంటీల అమలులో వైఫల్యం, హమీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరిస్తారు. బకాయి కార్డులను ఇంటింటికీ వెళ్లి ఇస్తారు. 3న రైతు సదస్సు లు, 4న మహిళలు, దివ్యాంగుల సదస్సులు, 5న విద్యార్థులు, యువత ర్యాలీలు, 6న అన్ని గ్రామాల్లో ర్యాలీలు, 7న ప్రజావాణిలో అన్ని స్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాలపై ఫిర్యాదులు 8న అంబేద్కర్ విగ్రహలకు వినతి పత్రాలు అంద చేయాలని నిర్ణయించారు. అయా వర్గాల ప్రజలకు జరుగుతున్న నష్టాలను వారి దృష్టికి తీసుకువెళ్లి మద్దతు కూడగ ట్టడానికి బీఆర్‌ఎస్ వ్యూహం రుపొందిం చింది. రాబోయే రోజులో నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలకు అండగా పోరాట కార్యక్రమాలను రూపొందించాలని అది ష్ఠానం తన శ్రేణులకు పిలుపునిచ్చింది.
వారం రోజుల పాటు ఆందోళనలు..
- కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే,
కాంగ్రెస్ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలను నిర్వహి స్తాం. బుధవారం నుంచి 8 వరకు వివిధ ఆందోళన కార్యక్రమాలను చేపడతాం. ప్రభు త్వ వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లి వివరిస్తాం.