మున్సిపల్ కమిషనర్ తీరుపై బీఆర్‌ఎస్ ఆందోళన
ABN , Publish Date - Jul 29 , 2026 | 11:27 PM
క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తీరుపై వార్డుల కౌన్సిలర్లు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
రామకృష్ణాపూర్, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తీరుపై వార్డుల కౌన్సిలర్లు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సం దర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు రాజారమేష్, కౌన్సిలర్లు మాట్లాడుతూ కుల వివక్షత పేరుతో మున్సిపల్ చైర్‌పర్సన్‌కు సమాచారం అందించకుండా వా ర్డుల పర్యటన చేస్తున్నారని 1వ వార్డులో వార్డు కౌన్సిలర్‌కు సమాచారం ఇ వ్వకుండా వార్డు పర్యటన చేస్తున్న క్రమంలో వార్డు కౌన్సిలర్ తనకు సమా చారం ఎందుకు అందించలేదని ప్రశ్నించినందుకు దుర్బాషలాడుతూ వాద నకు దిగడం సరైంది కాదని పేర్కొన్నారు. కమిషనర్ పాలన కంటే వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం సరికాదన్నారు. కొంత కాలంగా మున్సిపల్ కమి షనర్ తీరు ఇబ్బందిగా ఉందన్నారు. కమిషనర్ అవినీతి పరుడని, వెంటనే ఇక్కడ నుంచి అతన్ని బదలీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో మున్సిపల్ కమిషనర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాల ని ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గొ డిసెల సంధ్యారాణి, నాయకులు డాక్టర్ రాజారమేష్, కౌన్సిలర్లు భూమన్న, సత్తయ్య, కుమార్, సతీష్ పాల్గొన్నారు.