Share News

రేపు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ సమావేశం

ABN , Publish Date - May 11 , 2026 | 06:29 AM

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలి ఎన్నికల ఫలితాలు, తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో..

రేపు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలి ఎన్నికల ఫలితాలు, తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. పార్టీ ముఖ్య నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 12న ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభాపక్ష ఉపనాయకులతో కేసీఆర్‌ సమావేశం కానున్నట్లు పార్టీ వెల్లడించింది. ఇందులో ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదు, ఇన్‌చార్జిల నియామకంతోపాటు పార్టీ బలోపేతం, వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుతదితర ముఖ్య విషయాలపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - May 11 , 2026 | 06:29 AM