Share News

రైజింగ్‌ కాదు.. చీకటి తెలంగాణ: వెంకట్రామిరెడ్డి

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:50 AM

ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లు ఇది రైజింగ్‌ తెలంగాణ కాదని.. చీకటి తెలంగాణగా మారుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి దుయ్యబట్టారు

రైజింగ్‌ కాదు.. చీకటి తెలంగాణ: వెంకట్రామిరెడ్డి

ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లు ఇది రైజింగ్‌ తెలంగాణ కాదని.. చీకటి తెలంగాణగా మారుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి దుయ్యబట్టారు. సోమవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. గతంలో రైతులకు పెట్టుబడి సాయంగా కేసీఆర్‌ నాట్ల సమయానికే రైతుబంధు వేస్తే.. నేడు రేవంత్‌ ప్రభుత్వంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్లు వచ్చినప్పుడే వేస్తున్నారని మండిపడ్డారు. ఇది అభివృద్ధి బడ్జెట్‌ కాదని, అప్పుల బడ్జెట్‌ అని.. అన్ని వర్గాల ప్రజలకు నిరాశే మిగిల్చిందని విమర్శించారు. ఇది నోట్లో వేసుకోవడానికి మధురంగా తేనె లాగే ఉందని, కానీ గొంతులోకి వెళ్లాక చేదుగా ఉందని ఎద్దేవా చేశారు.

Updated Date - Mar 24 , 2026 | 05:50 AM