మునిసిపల్ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి ఫెయిల్
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:00 AM
మునిసిపల్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని, వీధి దీపాలు కూడా సరిగా వేయలేనివారు విజన్ 2047 గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీఆర్‌ఎస్ అసెంబ్లీ...
రెండేళ్లలో కూల్చడాలు తప్ప హైదరాబాద్‌కు చేసిందేమీ లేదు
బీఆర్‌ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని, వీధి దీపాలు కూడా సరిగా వేయలేనివారు విజన్ 2047 గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీఆర్‌ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హైదరాబాద్ నగర అభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే సీఎంకు అభివృద్ధి గుర్తొస్తుందని, అందుకే ఇప్పుడు సమీక్షలు చేస్తున్నారని, అవి కేవలం హంగు ఆర్భాటాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఈ రెండేళ్లలో మూసీ ప్రాజెక్టును, హైడ్రాను అడ్డుపెట్టుకొని కూల్చడాలు తప్ప.. హైదరాబాద్‌కు ఆయన చేసిందేమీ లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని, రెండేళ్లలో హైదరాబాద్‌లో ఒక్క ఇల్లయినా నిర్మించారా? మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.