Share News

కుతంత్రాలను ఖండిస్తున్నాం: హరీశ్‌

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:01 AM

కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.

కుతంత్రాలను ఖండిస్తున్నాం: హరీశ్‌

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్‌ను టచ్‌ చేయడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్‌ చేయడమేనని గురువారం ‘ఎక్స్‌’ వేదికగా హెచ్చరించారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్‌ వంటి నాయకుడిపై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని విమర్శించారు. సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్‌ పేరుతో నోటీసులు జారీ చేయడం రేవంత్‌రెడ్డి చౌకబారు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. కాగా, కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ నేతలు కొప్పుల ఈశ్వర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, కర్నె ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 04:01 AM