Share News

కిషన్‌రెడ్డి.. వేల కోట్ల రూపాయల అధిపతి

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:44 AM

తెలంగాణ రాజకీయ నేతల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అపర కుబేరుడని బీఆర్‌ఎస్‌ అంబర్‌ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. ఆదివారం బర్కత్‌పురలో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో వెంకటేశ్‌ మాట్లాడారు.

కిషన్‌రెడ్డి.. వేల కోట్ల రూపాయల అధిపతి

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌

బర్కత్‌పుర, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయ నేతల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అపర కుబేరుడని బీఆర్‌ఎస్‌ అంబర్‌ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. ఆదివారం బర్కత్‌పురలో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో వెంకటేశ్‌ మాట్లాడారు. దూబాయ్‌, సింగపూర్‌, బెంగళూరు, ఉత్తరాది రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. అంత సంపద ఉన్నా.. తెలంగాణలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలకు ఏదైనా ఆపద వస్తే ఎలాంటి సహాయం చేయరని.. నవ్వుకుంటూ దండంపెట్టి బుజ్జగిస్తారని విమర్శించారు. అంబర్‌పేట నియోజకవర్గం, హైదరాబాద్‌, రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

Updated Date - Jan 26 , 2026 | 03:44 AM