ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతపై ప్రైవేటు బిల్లుకు అనుమతించండి
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:49 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతకోసం ప్రైవేటు మెంబర్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ...
స్పీకర్‌ను కలిసి నోటీసును అందజేసిన బీఆర్‌ఎస్ఎల్పీ..
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధతకోసం ప్రైవేటు మెంబర్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్షం కోరింది. సోమవారం కేటీఆర్ నేతృత్వంలో స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో కలిసిన పార్టీ ఎమ్మెల్యేలు ఈ మేరకు నోటీసును ఇచ్చారు. ప్రైవేటు మెంబర్ బిల్లు ద్వారా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించేందుకు వీలు కలుగుతుందని, అత్యంత కీలకమైన ఈ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి అనుమతినివ్వాలని స్పీకర్‌ను వారు కోరారు. అసెంబ్లీ కార్యదర్శికి కూడా ఈ బిల్లు తాలూకు నోటీసులను కేటీఆర్ అందజేశారు.