Share News

పైలట్‌పై బీఆర్‌ఎస్‌ వేటు..?

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:00 AM

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డిపై ఆ పార్టీ వేటు వేయనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

పైలట్‌పై బీఆర్‌ఎస్‌ వేటు..?

  • సామాజిక మాద్యమాల్లో విస్తృత ప్రచారం

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డిపై ఆ పార్టీ వేటు వేయనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కేసులో ఆయనకు 14రోజుల రిమాండ్‌ విధించిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతోందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్స్‌ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను పార్టీలో కొనసాగిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఆయనను సస్పెండ్‌ చేయడమే మంచిదని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై స్పందించకుంటే డ్రగ్స్‌ దందా.. అక్రమ వ్యవహరాలను.. పార్టీ పరంగా సమర్థించినట్లే అవుతుందని బీఆర్‌ఎస్‌ నేతలు కొందరు అధిష్ఠానంతో చెప్పినట్లు సమాచారం. మరోవైపు, తనపై చర్యలు తీసుకుంటే పార్టీలోని పెద్దలతో ఉన్న సంబంధాలను బయట పెడాతనని ఆయన హెచ్చరిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేపై బీఆర్‌ఎస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Updated Date - Mar 17 , 2026 | 05:00 AM