Share News

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:07 PM

కొ ల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్య కర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ నాయకులు
బీఆర్‌ఎస్‌ నాయకురాలు పసుల సుజాతకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి జూపల్లి

కొల్లాపూర్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : కొ ల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్య కర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి మంత్రి జూపల్లి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కొల్లాపూర్‌ పట్టణంలోని 1వ వార్డులో పసుల సతీష్‌ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాలనీ యువకు లు, మహిళలు అధిక సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పసుల సుజాతసతీష్‌కు మంత్రి కాంగ్రెస్‌ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ కొల్లాపూర్‌ నియో జకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి సహకారంతో విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరు గుతున్నాయని అన్నారు. కొల్లాపూర్‌ ప్రాంతాన్ని ఉమ్మడి పాలమూరు జి ల్లాలోనే అభివృద్ధిలో నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతానని జూపల్లి వెల్లడించారు. మునిసి పల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కొల్లాపూర్‌ మునిసి పాలిటీలో అన్ని స్థానాలను కైవసం చేసుకుం టుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Jan 24 , 2026 | 11:07 PM