ఏబీఎన్ చానల్‌పై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:47 AM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌లో చర్చా కార్యక్రమానికి పిలిచి ఎమ్మెల్సీ రవీందర్‌రావును అవమానించారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.
మండలి చైర్మన్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల ఫిర్యాదు
హైదరాబాద్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌లో చర్చా కార్యక్రమానికి పిలిచి ఎమ్మెల్సీ రవీందర్‌రావును అవమానించారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. బీఆర్‌ఎస్ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, సభ్యులు రవీందర్‌రావు, దేశపతి శ్రీనివాస్ మంగళవారం మండలి చైౖర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిశారు. ఇది రవీందర్‌రావు ఒక్కడికే కాకుండా మండలి సభ్యులందరికీ జరిగిన అవమానంగా భావించి చర్యలు తీసుకోవాలని కోరామని బీఆర్‌ఎస్ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు.