Share News

బీఆర్‌ఎస్‌ నేతలపై సకల జనుల సమ్మె కేసు కొట్టివేత

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:34 AM

సకల జనుల సమ్మెలో భాగంగా 2011లో మాజీ సీఎం కేసీఆర్‌తో సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలపై బంజారాహిల్స్‌లో నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది.

బీఆర్‌ఎస్‌ నేతలపై సకల జనుల సమ్మె కేసు కొట్టివేత

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): సకల జనుల సమ్మెలో భాగంగా 2011లో మాజీ సీఎం కేసీఆర్‌తో సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలపై బంజారాహిల్స్‌లో నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. 2011లో రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు అప్పటి మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి ముందు ధర్నా చేసిన కేటీఆర్‌, పద్మారావు, శంభీపూర్‌ రాజు, దాసోజు శ్రవణ్‌ మరో 22 మంది నేతలపై ఐపీసీ 188, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆతర్వాత తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను జీఓ నెంబర్‌ 166 ప్రకారం చాలా వరకు కొట్టేశారు. అయితే, ఇప్పటికీ కేసీఆర్‌పై ఈ కేసు పెండింగ్‌లో ఉండడంతో బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ న్యాయవాది జక్కుల లక్ష్మణ్‌ నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో విచారించి, కేసును కొట్టేశారు.

Updated Date - Mar 10 , 2026 | 03:34 AM